"చంపితే పోలీస్ స్టేషన్‌లోనే చంపేయండి.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా": ప్రశ్న రావణ్

Wait 5 sec.

డిప్యూటీ సీఎం చేశారనే కేసులో అరెస్ట్ అయిన మంజూరు చేసింది. అయితే ప్రశ్న రావణ్ కోర్టు నుంచి బయటకు వచ్చిన కాసేపటికే మరో కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రశ్న రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రశ్న యూట్యూబ్ ఛానెల్‌లో రావణ్ ఓ వీడియో విడుదల చేశారు. వస్తే.. ఐదోసారి అరెస్ట్ చేయడం ఏపీ చరిత్రలోనే తొలిసారంటూ మండిపడ్డారు. తనను చంపితే పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలని.. లేదా తానే ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతానంటూ హెచ్చరించారు. " ఇప్పుడే నాలుగో బెయిల్ వచ్చింది. ఈలోపే ఐదో అరెస్ట్ జరిగింది. వేంపాడు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకుని నక్కపల్లి తరలిస్తున్నారు. ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. మీరు చంపితే నేను ఒక్కణ్ణే చచ్చిపోతా. ప్రశ్నించేవాళ్లు ఎవరూ చావరు. మీరు రావణ్‌ను మాత్రమే చంపగలరు. ప్రశ్నను చంపలేరు. ఇంత భయపడుతున్నారా.? ఐదువందల మంది పోలీసులు ప్రజా సమస్యలు అన్నీ వదిలేసి నా కోసం తిండీతిప్పలు లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకూ నాకు సెక్యూరిటీ ఇస్తూ తిరుగుతున్నారు. మీకు సిగ్గనిపించడం లేదా?" అంటూ ప్రశ్న రావణ్ వీడియోలో పేర్కొన్నారు."రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా. నేనేమైనా దోపిడీలు చేశానా, దొమ్మీలు, దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడమే నా తప్పా. నాలుగు రోజుల నుంచి తిండి లేదు. నీళ్లు లేవు. మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్‌‍లోనే నా పీక పిసికేసి, లేదా గాదె సాయికృష్ణ లెక్కన చంపేయండి. అలా కాకుండా మొత్తం వ్యవస్థను ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెడుతూ.. నా గొంతు నొక్కో, లేదా నన్ను చంపితే ప్రశ్నలు ఆగుతాయని అనుకుంటే పొరబాటే. బెయిల్ రాగానే అరెస్ట్. నాలుగు రోజులలో నాలుగు బెయిల్స్ వస్తే వెంటనే ఐదోసారి అరెస్ట్. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడైనా ఇలాంటిది ఉందా. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్." అని ప్రశ్న రావణ్ ఆరోపించారు. "జనసేన నియోజకవర్గాలలోనే నా మీద కేసులు నమోదవుతున్నాయి. అక్కడికి నేను వెళ్లగానే చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిదా? నన్ను చంపుదామనుకుంటే ఇదంతా ఎందుకు.. డైరెక్టుగా నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపేయండి.. లేదా ఆమరణ నిరాహార దీక్ష చేసి నేనే చనిపోతా.. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చట్టపరంగా నిరసన తెలిపే హక్కు, నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. జైల్లో పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు" అంటూ ప్రశ్న రావణ్ వీడియో విడుదల చేశారు.