మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 15 ఏళ్ల భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో టీమిండియా తరఫున ఆడాలన్న అతడి కల సాకారమైంది. ఈ యంగ్ సెన్సేషన్‌.. దీంతో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 1989లో పాకిస్థాన్‌పై 16 సంవత్సరాల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును వైభవ్‌ బద్దలు కొట్టాడు.ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్లలో కూడా చోటు దక్కించుకున్నాడు. మాంచెస్టర్‌లో అరంగేట్రం చేయడం ద్వారా సచిన్‌, పీయుష్ చావ్లా రికార్డును సైతం బ్రేక్ చేశాడు. చావ్లా 17 ఏళ్ల 75 రోజుల వయసులో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. వాషింగ్టన సుందర్ 18 ఏళ్ల 80 రోజుల వయసులో టీమిండియా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కులు..హసన్ రాజా (పాకిస్థాన్) - 14 ఏళ్ల 227 రోజులు, 1996వైభవ్ సూర్యవంశీ (భారత్‌) - 15 ఏళ్ల 99 రోజులు, 2026మహమ్మద్ షరీఫ్ (బంగ్లాదేశ్‌) - 15 ఏళ్ల 116 రోజులు, 2001ముస్తాక్ మహమ్మద్ (పాకిస్థాన్‌) - 15 ఏళ్ల 224 రోజులు, 1959ఆకిబ్ జావెద్ (పాకిస్థాన్‌) - 16 ఏళ్ల 127 రోజులు, 1988సచిన్ టెండూల్కర్ (భారత్‌) - 16 ఏళ్ల 205 రోజులు, 1989ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో కొట్టిన షాట్ ఉంది. వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన ఈ రిస్కీ షాట్‌తో వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సిక్సర్‌ నమోదు చేశాడు. విల్ జాక్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ముందుకొచ్చిన అతడు.. జోస్ బట్లర్ స్టంపౌట్ చేయడంతో పెవిలియన్ చేరాడు.