ఖమేనీ అంత్యక్రియల్లో భారీ ప్రాణనష్టానికి సిద్ధమైన ఇరాన్.. సంచలన నివేదిక

Wait 5 sec.

తమ అంత్యక్రియల ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఇరాన్ ప్రభుత్వం పైకి ప్రదర్శిస్తున్నప్పటికీ.. వేలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనే భయానిక పరిస్థితిని ఎదుర్కొడానికి అధికారులు లోలోపల సన్నాహాలు చేస్తున్నారని జర్మన్ వార్తాపత్రిక 'డై వెల్ట్' సంచలన నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం.. ఐదు రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా 1,500 నుంచి 3,000 మంది వరకు మరణాలు సంభవించవచ్చని అంచనా వేస్తూ ఇరాన్ అధికారులు అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశారు.వేలాది సమాధులు సిద్ధంసంభవించబోయే మరణాలు, తప్పిపోయే వ్యక్తుల కేసులను పరిష్కరించడానికి అధికారులు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని, అలాగే టెహ్రాన్‌లోని బెహెష్ట్-ఎ జహ్రా శ్మశానవాటికలో వేలాది కొత్త సమాధులను సిద్ధం చేశారని ఆ నివేదిక పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా పేరు వెల్లడించడానికి నిరాకరించిన టెహ్రాన్ మునిసిపాలిటీ ఉద్యోగి ఒకరు.. ఈ సన్నాహాలు వాస్తవమని ఆ వార్తాపత్రికకు తెలిపారు.‘‘సిద్ధం చేసిన సమాధులు నిజంగానే ఉన్నాయి.. 3,000 మంది వరకు మరణించినా ఫర్వాలేదని బాధ్యతలు నిర్వర్తించే అధికారులకు చెప్పారు.. ఇంత పెద్ద జనసమూహం, ఈ తీవ్రమైన వేడితో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.’’ అని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం టెహ్రాన్‌లో ప్రారంభమై, పవిత్ర నగరమైన ఖోమ్ గుండా కొనసాగి, ఆ తర్వాత ఇరాక్ నగరాలు నజఫ్, కర్బలాలకు చేరుకుంటాయి. ఈ కార్యక్రమాలు గురువారం మషద్‌లో ముగుస్తాయని, అక్కడే ఆయనను ఖననం చేస్తారని భావిస్తున్నారు. డై వెల్ట్ నివేదిక ప్రకారం.. అధికారులు టెహ్రాన్ అంతటా రాకపోకలపై ఆంక్షలు, ప్రజలను తరలించడానికి వేలాది బస్సులు, జనసమూహాలకు ఆహారం అందించడానికి తాత్కాలిక వంటశాలలు, సందర్శకుల వసతి కోసం పాఠశాలలు, మసీదుల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. భారీ జనసమూహాలు, విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు త్వరగా ప్రమాదకరంగా మారవచ్చనే భయాలను రేకెత్తిస్తోంది.గతంలో జరిగి అంత్యక్రియల విషాదాలు2020లో అమెరికా దాడిలో హతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కమాండర్ ఖాసీమ్ సులేమానీ అంత్యక్రియల సందర్భంగా కెర్మాన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. దశాబ్దాల కిందట 1989లో జరిగిన రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలు కూడా గందరగోళానికి దారితీసి, కనీసం ఎనిమిది మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.దాడుల భయంజనసమూహం తొక్కిసలాట ప్రమాదంతో పాటు, ఇరాన్ భద్రతాపరమైన ముప్పులను కూడా ఊహిస్తున్నారు. అంత్యక్రియలకు ముందు, వేడుకల సమయంలో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకునే ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ హిట్‌లిస్ట్‌లో ఉన్నారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది.లక్షలాది మంది ప్రజలు, ఇరాన్ ఉన్నత నాయకులు హాజరవుతారని అంచనా వేస్తున్నందను ఏ చిన్న దాడి జరిగినా ఫలితాలు ఘోరంగా ఉంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఖమేనీ అంత్యక్రియలు సందర్భంగా ఆయనకు తుది నివాళులు అర్పించడానికి గ్రాండ్ మొసల్లా వద్ద గుమిగూడిన జనసమూహాన్ని నియంత్రించేందుకు, భద్రతా సిబ్బంది నివారణ చర్యగా మానవ హారాన్ని ఏర్పాటు చేశారు.అంత్యక్రియలు ప్రారంభానికి ముందు టెహ్రాన్ వీధుల్లో భద్రతా సిబ్బంది గస్తీ కాస్తున్న దృశ్యాలు రాయిటర్స్ ఫుటేజ్‌లో కనిపించగా.. ఇరాన్ సోమవారం తన గగనతలాన్ని కూడా మూసివేసింది. ఇజ్రాయెల్ సైనిక గూఢచార సంస్థ ఇరాన్ విభాగానికి మాజీ చీఫ్ డానీ సిట్రినోవిట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్ అధికారులు బహుముఖ ముప్పుల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు.‘‘అన్నివైపుల నుంచి వచ్చే ముప్పులను వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు.. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.. అందుకే ప్రతిదానికీ భారీ భద్రత కల్పించారని’’ ఆయన తెలిపారు.