"ఇంకా ఎంతకు దిగజారుతారు.. సిగ్గులేదా? మీరింక మారరు": ప్రకాష్ రాజ్

Wait 5 sec.

యూట్యూబర్ స్పందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో శనివారం రోజున ఎలమంచిలి కోర్టు రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కాసేపటికే మరో కేసులో వేంపాడు టోల్ గేట్ వద్ద తనను అదుపులోకి తీసుకున్నారంటూచేశారు. ఈ పరిణామాలపై. ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. "నాలుగోసారి బెయిల్, మళ్లీ ఐదోసారి అరెస్ట్... ఇది న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడమే. ప్రజలంతా గమనిస్తున్నారు. మీ అహంకారం, మీ అసహనం ప్రశ్నించే గొంతుకల పట్ల మీకున్న భయాన్ని మేము చూస్తున్నాం. మా పోరాటం కొనసాగుతుంది. #justasking" అంటూ ట్వీట్ చేశారు."ఇంకా ఎంతకు దిగజారుతారు. నాలుగు రోజులలో, నాలుగు కేసులలో, నాలుగోసారి రావణ్ బెయిల్ తీసుకున్నారు. నాలుగు వేరే కోర్టులలో, నాలుగో వేరే వేరే జడ్జిలు మీరు పెట్టింది తప్పుడు కేసులు అని చెప్పినా.. సిగ్గులేకుండా, అహంకారంతో పదవి ఉందని ఇంకో కేసు వేసి తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు చూస్తున్నారు. అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా రావణ్‌కు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు. మన హీరో అద్భుతంగా వాదించి నాలుగో బెయిల్ తెచ్చారు. ఇది ఇంతటితో ఆగదు. మీరు దౌర్జన్యాలు చేసే కొద్దీ జనాలకు అర్థమవుతుంది. ఇది ఇక్కడితో పూర్తవలేదు. తిరిగి మూల్యం చెల్లించుకుంటారు." అంటూ ప్రకాష్ రాజ్ వీడియో విడుదల చేశారు. మరోవైపు ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినందుకు వరుస కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. నాలుగుసార్లు బెయిల్ వచ్చినా ఐదోసారి తనను అరెస్ట్ చేసి నక్కపల్లికి తీసుకెళ్తున్నారంటూ వీడియో విడుదల చేశారు. ఒక్క వ్యక్తి కోసం వ్యవస్థను ఇబ్బంది పెట్టడం సరికాదని.. ఇంతకంటే పోలీస్ స్టేషన్‌లోనే తనను చంపేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి తానే చనిపోతానంటూ ప్రశ్న రావణ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది.