అయోధ్యలోనే కాదు.. బద్రీనాథ్ ఆలయంలోనూ విరాళాలు చోరీ!

Wait 5 sec.

అయోధ్యలోని కలచివేస్తోంది. ఇలాంటి తరుణంలో మరో ఆలయంలోనూ భక్తులు సమర్పించిన కానుకలు దోచేశారనే ఆరోపణలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. బద్రీనాథ్ ఆలయంలో విరాళాలు, కానుకల దొంగతనం జరిగిందని ఒక సామాజిక సంస్థ ఆరోపించడంతో బద్రీ కేదార్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. రామ మందిరంలో విరాళాల దొంగతనంపై వివాదం చెలరేగిన కొద్ది రోజులకే.. గర్వాల్ పరిధిలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా మరో 47 ఆలయాలలో కానుకల నిర్వహణలో కఠినమైన పర్యవేక్షణ, పారదర్శకత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించిన మర్నాడే ఆరోపణలు వెలుగులోకి రావడం గమనార్హం.'భైరవ్ సేన సంఘటన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ బీకేటీసీ సీఈఓ సోహన్ సింగ్ రంగర్‌కు శుక్రవారం లేఖ రాసింది. బద్రీనాథ్ ఆలయంలో విరాళాలు, కానుకల దొంగతనంలో బీకేటీసీ ఉద్యోగి ఒకరు పాలుపంచుకున్నారని ఆరోపించింది. సదరు ఉద్యోగిని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేదికి వ్యక్తిగత కార్యదర్శిగా ఆ సంస్థ పేర్కొంది. ఈ ఆవకతవకలను గతంలోనే ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చామని, ఆరోపణలను ధ్రువీకరించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని ఆలయ కమిటీని ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు సందీప్ ఖత్రి కమిటీని కోరారు.ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన హేమంత్ ద్వివేది.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని ఆయన స్పష్టం చేశారు. ‘‘సంబంధిత ఉద్యోగి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీలో రెగ్యులర్ ఉద్యోగి.. గతంలో ముగ్గురు చైర్‌పర్సన్‌లకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు నిజమని తేలితే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ద్వివేది అన్నారు.ఫిర్యాదు నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు సీఈఓ రంగర్ తెలిపారు. ‘‘ఫుటేజీలో ఆశించినంత స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ విషయం తీవ్రత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, చైర్మన్‌కు సమాచారం అందించాం.. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరుతాం’’ అని ఆయన అన్నారు.అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా సమగ్ర విచారణ జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ‘‘విచారణలో ఏదైనా అవకతవకలు జరిగినట్టు వెల్లడయితే శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం 1939.. వర్తించే సేవా నిబంధనల ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని రంగర్ అన్నారు.ప్రస్తుత చార్ ధామ్ యాత్ర సీజన్‌లో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు విరాళాల రూపంలో సుమారు రూ. 70 కోట్లు అందినట్లు తెలిపారు. అతిథి గృహాల ద్వారా కూడా బీకేటీసీ ఆదాయం పొందుతుందని ఆయన చెప్పారు. ‘‘వార్షిక విరాళాలు సగటున రూ. 50 కోట్ల నుంచి రూ. 80 కోట్ల మధ్య ఉంటాయి. ఈ మొత్తం యాత్రికుల సంఖ్య, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.బ్యాంకు సిబ్బంది సమక్షంలో నలుగురు లేదా ఐదుగురు బీకేటీసీ ఉద్యోగుల బృందం విరాళాలను లెక్కిస్తుందని రంగర్ తెలిపారు. ‘‘లెక్కింపు ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలనుకునే భక్తులను కూడా వారి గుర్తింపు పత్రాలను ధ్రువీకరించుకున్న తర్వాత పాల్గొనడానికి అనుమతిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత, విరాళాలను బ్యాంకు ఉద్యోగులకు అప్పగిస్తారు.. వారు వాటిని మళ్లీ లెక్కిస్తారు’’ అని ఆయన అన్నారు.