: ఆధార్ కార్డుదారులకు జారీ సంస్థ యూఐడీఏఐ అదిరే శుభవార్త చెప్పింది. కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్‌లో ఇ-మెయిల్ అప్డేట్ ఉచిత సేవలను అందుబాటులోకి తెస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రకటన చేసింది. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఈ ఉచిత సేవలను ఆధార్ కార్డుదారులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఉంటుందని ఉడాయ్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. కొత్తగా ఇ-మెయిల్ యాప్ చేసుకోవాలని భావించే వారు లేదా ఇప్పటికే ఉన్న ఇ-మెయిల్‌ను మార్చుకోవాలనుకునే వారు లో ఉచితంగా అందిస్తోన్న ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన రెండు రోజుల్లోనే సమారు 2.5 లక్షల మంది తమ ఇ-మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకున్నట్లు తెలిపింది. ఆధార్‌లో ఇ-మెయిల్ అప్డేట్ చేసుకోవడం ద్వారా ఆధార్ అథంటికేషన్ రిక్వెస్టులు వచ్చినప్పుడు రియల్ టైమ్ అలర్టులు వస్తాయని తెలిపింది. అలాగే ఉడాయ్ తెలిపింది. కొత్త మొబైల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 40 లక్షల మంది తమ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకున్నట్లు తెలిపింది. అలాగే దాదాపు 10 లక్షల మంది తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని ఉడాయ్ వెల్లడించింది. ఇ-మెయిల్ అడ్రస్ ప్రాసెస్ ఇదేముందుగా లేటెస్ట్ ఆధార్ యాప్‌లోకి లాగిన్ కావాలిసర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లి అందులోని ఇ-మెయిల్ ఐడీ ఆప్షన్ ఎంచుకోవాలిమీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలిఆపై మీ మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలిఫేస్ అథంటికేషన్ పూర్తి చేయడం ద్వారా అప్డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి