వేదాంతా నుంచి మరో మల్టీబ్యాగర్- 14 రోజుల్లోనే లక్షకు రూ. 2.23 లక్షలొచ్చాయ్- బంగారు బాతేనా ఇది!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ మంచి జోష్‌లో కనిపిస్తున్నాయి. వరుస సెషన్లలో పుంజుకుంటున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపిస్తున్న వేళ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం సెషన్‌లో దూసుకెళ్లగా శుక్రవారం రోజు కూడా అదే జోరు కనబరుస్తున్నాయి. జులై 3న వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 130 పాయింట్లకుపైగా పుంజుకుంది. ఇదే సమయంలో ప్రముఖ మైనింగ్, మెటల్స్ సంస్థ వేదాంతా షేర్లు కూడా ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. ఇటీవల సంస్థ . ఇక్కడ కొన్ని లిస్టింగ్ దగ్గరి నుంచి భారీగా పెరుగుతూ వస్తున్నాయి.ఇందులోనే మనం ప్రముఖంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 15 రోజులు కూడా కాకముందే ఇన్వెస్టర్లకు బంగారు బాతుగా మారినట్లు తెలుస్తోంది. అప్పుడే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. కేవలం రూ. 20 దగ్గర లిస్టింగ్ అవగా ఇది జస్ట్ 13 సెషన్లలో 100 శాతానికిపైగా పెరిగింది. అంటే డబ్బును రెట్టింపు చేసింది. 14 సెషన్లలో చూస్తే ఇప్పుడు రూ. 44.78 దగ్గరికి షేర్ ధర చేరింది. ఇలా వరుసగా పెరుగుతూ కాసుల పంట పండిస్తోంది. జులై 2న రూ. 42.65 వద్ద ముగిసిన వేదాంతా ఐరన్ & స్టీల్ స్టాక్ ఇవాళ జులై 3న 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 44.78 వద్ద ఉంది. ఇదే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరగా ఉంది. 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 19.06 గా ఉంది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 17.48 వేల కోట్లకు చేరుకుంది. ఇటీవల జూన్ 15న వేదాంతా నుంచి స్ప్లిట్ అయిన స్టాక్స్ ఎక్స్చేంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అప్పుడు వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ షేర్ రూ. 20 వద్ద లిస్టింగ్ అయింది. అక్కడి నుంచి మాత్రం వరుసగా పెరుగుతూ వచ్చింది. తొలి 10 సెషన్లలో 9 సెషన్లు 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టింది. బుధ, గురువారాల్లో 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. గత 5 రోజుల్లో 38 శాతం ఎగబాకింది. ఈ క్రమంలోనే ఇవాళ్టితో కలిపి లిస్టింగ్ నుంచి 14 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 123 శాతం పెరిగింది. అంటే లిస్టింగ్ సమయంలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ 14 రోజుల్లో రూ. 2.23 లక్షలు వచ్చాయన్నమాట. అంటే రూ. 1.23 లక్షల లాభం వచ్చింది. డబ్బు రెట్టింపైందన్నమాట. మరోవైపు వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇవాళ 3 శాతానికిపైగా పెరిగి రూ. 46 స్థాయిలో ఉండగా గత 5 ట్రేడింగ్ సెషన్లలో 40 శాతానికిపైగా పెరిగింది. ఇది రూ. 38 వద్ద లిస్టింగ్ అయింది. ఇక వేదాంతా లిమిటెడ్, వేదాంతా పవర్, వేదాంతా అల్యూమినియం మెటల్ లిమిటెడ్ షేర్లు అంతగా రాణించట్లేదు. Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. అందుకే ఇందులో పెట్టుబడి చేసే ముందు సెబీ గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.