: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్. దేశీయ మార్కెట్లో జులై 3వ తేదీన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తులం స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఏకంగా రూ.3000 మేర పెరిగింది. ఇక వెండి వారం నుంచి స్థిరంగా కొనసాగుతూ ఈరోజు రూ.5 వేల మేర పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి విలువ వంటి పలు కీలకమైన అంశాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి చూస్తే తులం బంగారం దాదాపు 10 శాతం వరకు తక్కువకే లభిస్తుండడం ఊరట కల్పించే విషయమని చెబుతున్నారు. ఈ క్రమంలో జులై 3వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో మళ్లీ జంప్అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 100 డాలర్లపైన పెరిగింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4172 డాలర్లు దాటేసింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 3.34 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 62 డాలర్ల పైకి చేరి ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధర ఈరోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర తులానికి ఏకంగా రూ.3000 మేర పెరిగింది. దీంతో 10 గ్రాములు బంగారం రేటు రూ. 1,43,780 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల 916 ప్యూరిటీ బంగారం ధర ఒక్కరోజే రూ.2750 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.1,31,800 స్థాయికి ఎగబాకింది. రూ.5000 పెరిగి వెండి ధరబంగారంతో పాటు వెండి రేటు సైతం ఒక్కసారిగా పెరిగింది. దేశీయంగా వెండి ధరలు గత వారం నుంచి స్థిరంగా ఉండి సడెన్‌గా పెరిగి షాకిచ్చాయి. ఈరోజు కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.5000 మేర పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.2,50,000 మార్క్ తాకింది. Note: పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్లు జులై 3వ తేది శుక్రవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10 గంటల తర్వాత మారుతుంటాయి. కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలు వేరు వేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే ధరలు తెలుసుకోవడం మంచిది.