డ్రైవర్ లెస్ కారులో టీడీపీ ఎమ్మెల్యే జర్నీ.. ఇద్దరు పిల్లలతో కలిసి, వీడియో వైరల్

Wait 5 sec.

విదేశాల్లో డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి వారి అనుభూతిని అందరితో పంచుకున్నారు. డ్రైవర్ లేకుండానే ముందుకు సాగే ఆ కారులో ప్రయాణం అద్భుతమంటూ అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కూడా డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదటిసారి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందంటూ అనంతపురం జిల్లా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లారు.. అక్కడ డ్రైవర్ లెస్ కారులో తన పిల్లలతో కలిసి ప్రయాణం చేసినట్లు వీడియోను షేర్ చేశారు. డ్రైవర్ లెస్ కారులో తొలిసారి ప్రయాణిస్తున్నానని.. తాను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ అనుభూతిని అందరితో పంచుకున్నారు. డ్రైవర్ లేకుండా కారు అలా ముందుకు సాగుతోంది.. వెనుక సీట్లు ఎమ్మెల్యేతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు తాడిపత్రికి ఈ కారును ఎప్పుడు తీసుకొస్తున్నారంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని దేశాల్లో ఈ కార్లతో ట్యాక్సీలు కూడా నడుపుతున్నారు. పలువురు ప్రముఖులు విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అమెరికాలో వేమో (Waymo) పేరుతో రోబో ట్యాక్సీ సర్వీసు అందుబాటులో ఉంది. మొబైల్ యాప్ ద్వారా డ్రైవర్ లేని కార్లను బుక్ చేసుకోవచ్చు. కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, జార్జియా వంటి చోట్ల ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో స్పెషల్ కెమెరాలు, రాడార్, లైడార్ సెన్సార్లు ఉంటాయి. రోడ్డుపై ఈ కార్లు డ్రైవర్ లేకుండా ట్రాఫిక్, రోడ్డుపై వెళ్లే వారికి గమనిస్తూ ముందుకు సాగుతుంది. మరికొన్నిదేశాల్లో కూడా ఈ డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.