టాప్ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఇవే.. ఎస్బీఐ, HDFC లో 5 లక్షలపై నెలకు ఈఎంఐ ఎంత?

Wait 5 sec.

: బ్యాంకులు మనకు ఎన్నో రకాల లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. హోం లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ప్రాపర్టీ లోన్ ఇలా చాలానే ఉంటాయి. హోం లోన్, గోల్డ్ లోన్ వంటివి సురక్షిత లోన్లుగా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏదైనా తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అదే పర్సనల్ లోన్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఏం తాకట్టు పెట్టము కాబట్టి వీటిని అన్ సెక్యుర్డ్ లోన్లుగా చెబుతారు. అందుకే వడ్డీ రేట్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మనం చాలా అవసరాల కోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటామన్న సంగతి తెలిసిందే. అత్యవసరంగా ఆస్పత్రి ఖర్చుల కోసం, ఇంట్లో ఏమైనా అవసరాలకు, ఎటైనా వెకేషన్లకు వెళ్లాలన్నా, పెళ్లి ఖర్చుల కోసం, ఇంటి మరమ్మతులకు ఇలా పర్సనల్ లోన్ ఎక్కువగా తీసుకునే వారు ఉంటారు. పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ప్రతి దాంట్లో మారుతుంటాయి. ఇంకా ఇక్కడ లోన్ విషయంలో రుణ గ్రహీత సిబిల్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంటుంది. మెరుగైన సిబిల్ ఉన్న వారికి కనీస వడ్డీ రేటుకే అంటే చాలా స్వల్ప వడ్డీకే లోన్ లభించే అవకాశం ఉంటుంది. ఇంకా ఆయా రుణ గ్రహీతల ఆదాయం, స్థోమత, లోన్ మొత్తం ఆధారంగా కూడా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు చాాలా సులభంగానే లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ ఉంటే క్షణాల్లోనే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇప్పుడు మనం దేశంలోని టాప్ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో కేవలం 9.99 శాతం నుంచే ప్రారంభమవుతున్నాయి. మెరుగైన సిబిల్ ఉన్న వారికి ఈ కనీస వడ్డీ రేటుకే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే వడ్డీ రేటుపై రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే మూడేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 16,131 చొప్పున పడుతుంది. మొత్తం రూ. 80 వేల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఇక సిబిల్ కాస్త తక్కువగా ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. అక్కడ 11 శాతం వడ్డీ రేటుతో చూస్తే ఈఎంఐ రూ. 16,369 గా పడుతుంది. ఇక్కడ మొత్తం వడ్డీ దాదాపు రూ. 90 వేల వరకు పడుతుంది. ఇంకా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో రూ. 6500 వరకు ఉంటుంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులో చూస్తే లోన్ మొత్తంలో 2 శాతం వరకు ఉంటుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10 శాతం నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఇక్కడ 10 శాతం వడ్డీ రేటుతో చూస్తే 5 లక్షల లోన్‌పై మూడేళ్లకు ఈఎంఐ నెలకు రూ. 16134 చొప్పున పడుతుంది. అదే 12 శాతం వడ్డీ రేటుతో చూస్తే ఈఎంఐ నెలకు రూ. 16,607 చొప్పున పడుతుంది. ఇక్కడ మొత్తం రూ. 97 వేలకుపైగా వడ్డీ పడుతుంది.