ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్ నగరం గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లోని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వేలాది మంది ఇరానియన్లు బారులు తీరారు. ఈ సమయంలో పుండుమీద కారం జల్లిన చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కవ్వింపులకు పాల్పడ్డారు. సౌత్ డకోటాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మేము వెనుజులాను ఒక్క రోజులోనే ఓడించాం.. ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. అందుకే వాళ్లు కాళ్లబేరానికి వచ్చారు.. రాజీకోసం ప్రయత్నిస్తున్నారు. మేము మంచివాళ్లం కాబట్టి.. అతడి (ఖమేనీ) అంత్యక్రియల కోసం వీకాఫ్ ఇచ్చాం’’ఇరాన్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.ఖమేనీ శవపేటికను ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాతో కప్పి, దానిపై ఆయన నల్ల తలపాగాను ఉంచి ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. అయితే, ఆయన పార్థిదేహం పక్కన ఉన్న ఓ బుల్లి శవపేటికపైనే అందరి దృష్టి ఉంది. ఆ శవపేటికలో ఉంచారు. దానిపక్కనే ఆ పసిపాప ఫొటో ఫ్రేమ్‌ను పెట్టారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె శవపేటికతో సహా, మరణించిన ఆయన బంధువుల మృతదేహాలను కూడా ఆయన పక్కన ఉంచారు.ఇరాన్, ఇరాక్‌లోని నగరాల్లో ఆరు రోజుల పాటు జరగనున్న అంత్యక్రియల కార్యక్రమాల కోసం ఖమేనీ పార్థివ దేహం శుక్రవారం టెహ్రాన్‌కు చేరుకుంది. ఆయన పార్థివ దేహాన్ని ఇరాన్, పొరుగున ఉన్న ఇరాక్‌లోని నగరాల గుండా తీసుకువెళతారు. ఈ రోజు ప్రజల సందర్శనార్థం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాను తెరవడానికి ముందే, శుక్రవారం సాయంత్రం నుంచి వందల మంది మద్దతుదారులు బయట వేచి ఉన్నారు. రాబోయే మూడు రోజుల్లో కేవలం టెహ్రాన్‌లోనే 15 నుంచి 20 మిలియన్ల మంది పాల్గొంటారని తాము అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.శనివారం గేట్లు తెరుచుకోగానే, వేలాది మంది ప్రాంగణంలోకి ప్రవేశించారు. వారంతా ప్రతీకారానికి పిలుపునిచ్చే చిహ్నమైన ఎర్ర జెండాలతో అమెరికా ‘అమెరికాకు మరణం’, ‘ప్రతీకారం, ప్రతీకారం’ అని నినాదాలు చేసినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదించింది. ఓ 27 ఏళ్ల యువకుడు ‘నా ప్రియతమ నాయకుడు అలీ ఖమేనీకి వీడ్కోలు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను.. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ విషాదం జరగక ముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది’ అని అతడు కన్నీటిపర్యంతమయ్యాడు.ఇక, ఖమేనీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సోమవారం వరకూ టెహ్రాన్‌లోనే ఉంటుంది. సోమవారం అంతిమయాత్ర మొదలై.. మంగళవారం నాడు మత పెద్దల కేంద్రమైన ఖోమ్‌కు, బుధవారం పొరుగున ఉన్న ఇరాక్‌లోని పవిత్ర నగరాలకు, ఆపై గురువారం ఈశాన్య ఇరాన్‌లోని ఖమేనీ స్వస్థలమైన మషద్‌లో ఖననం కోసం తరలిస్తారు.