సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను కేంద్రం మార్చిందా? ఇలా ఒకేసారి చేతికి రూ. 69 లక్షలు.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

Wait 5 sec.

: మీరు పెట్టుబడులు పెడుతున్నారా? మరి ఇంతకీ ఎలాంటి స్కీమ్స్ ఎంచుకుంటున్నారు. ఏ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? మన కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, గోల్డ్, , ఇంకా ఆర్బీఐ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. వీటిల్లో ఏది ఎంచుకుంటున్నారనేదే ముఖ్యం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌తో కూడుకున్నవి. గోల్డ్, రియల్ ఎస్టేట్ అనిశ్చితికి లోబడి ఉంటాయి. మరీ ఎక్కువ రాబడి ఊహించలేం. బ్యాంక్ ఎఫ్‌డీ, రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నప్పటికీ ఇక్కడ వడ్డీ రేట్లు మరీ ఎక్కువగా ఏం ఉండవని చెప్పొచ్చు. కానీ రిస్క్ ఉండదు. ఇక అత్యంత సురక్షితమైన వాటిల్లో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు (పోస్టాఫీస్ పథకాలు), ఆర్బీఐ బాండ్లు వంటివి కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి చూద్దాం. ఇందులో ఆడపిల్లల కోసం కేంద్రం అందిస్తున్న అద్భుతమైన స్కీమ్ గురించి తెలుసుకుందాం. చాలా మంది ఈ పథకంలో పెట్టుబడులు పెడుతుంటారు. కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. . దీంతో ఇప్పుడు సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వద్దే యథాతథంగా కొనసాగుతోంది. ఈ పథకాల్లో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో కలిసి దీంట్లోనే వడ్డీ రేటు అధికంగా ఉంది. ఈ స్కీమ్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. సుకన్య సమృద్ధి పథకం వివరాలుఇది కేవలం ఆడపిల్లల కోసమే అందుబాటులో ఉన్న స్కీమ్.పాప పదేళ్లలోపు వయసులోనే ఇందులో చేరాలి.వరుసగా 15 ఏళ్లు డబ్బుల్ని జమ చేస్తూ పోవాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 21 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు.ఈ పెట్టుబడిని ఏటా ఒకేసారి జమ చేయొచ్చు లేదా గరిష్ఠంగా 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో చేయొచ్చు.విత్‌డ్రా విషయానికి వస్తే పాపకు 18 ఏళ్ల వయసు వచ్చినా లేదా పదో తరగతి పూర్తయినా బ్యాలెన్స్ నుంచి 50 శాతం వరకు డబ్బుల్ని పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.ఇక 18 ఏళ్లు దాటి పెళ్లయ్యాక అకౌంట్ క్లోజ్ చేసి పూర్తి డబ్బులు తీసుకోవచ్చు.అలా కాకుంటే అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మొత్తం డబ్బులు వస్తాయి. ఈ స్కీంలో మెరుగైన టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. పెట్టుబడి, వడ్డీ రాబడి, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై ఎలాంటి టాక్స్ ఉండదు. ఇదీ చూడండి: ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంతొస్తుంది?ఈ పథకంలో ఏడాదికి ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలో కట్టొచ్చు కాబట్టి.. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం. పాపకు ఏడాది వయసున్నప్పుడు 2026లో ఈ స్కీంలో చేరితే నెలకు రూ. 1000 లేదా ఏడాదికి రూ. 12 వేల చొప్పున జమ చేస్తూ పోతే 15 ఏళ్లకు మొత్తం పెట్టుబడి రూ. 1.80 లక్షలు అవుతుంది. 2047లో అకౌంట్ మెచ్యూరిటీ సమయంలో చేతికి మొత్తం రూ. 5.54 లక్షల వరకు వస్తుంది. నెలకు రూ. 5 వేలు లేదా ఏడాదికి రూ. 60 వేల చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ. 9 లక్షలపై మెచ్యూరిటీకి రూ. 27.71 లక్షలు వస్తాయి. నెలకు రూ. 10 వేలు లేదా ఏడాదికి రూ. 1.20 లక్షల చొప్పున జమ చేస్తూ పోతే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 18 లక్షలపై చేతికి ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో రూ. 55.42 లక్షలు వస్తాయి.ఇక గరిష్ఠ పెట్టుబడి అయిన ఏడాదికి రూ. 1.50 లక్షలు లేదా ప్రతి నెలా రూ. 12500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే అప్పుడు మీ పెట్టుబడి మొత్తం రూ. 22.50 లక్షలైతే చేతికి ఒకేసారి రూ. 69.27 లక్షలు వస్తాయి. ఇక్కడ వడ్డీతోనే రూ. 46.77 లక్షల వరకు వస్తుందని చెప్పొచ్చు.