: మ్యూచువల్ ఫండ్స్‌లో హైరిటర్న్స్ వస్తాయని చాలా మంది చెబుతుంటారు. అయితే, సరైన ఫండ్ ఎంచుకుని సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. అయితే, మ్యూచువల్ ఫండ్ హిస్టరీలోనే రికార్డ్ నమోదు చేసింది ఓ స్కీమ్. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్స్‌లో 1200 ఫండ్స్‌లో కేవలం ఒకే ఒక్క స్కీమ్ తమ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. మిగితా ఫండ్స్‌ని వెనక్కి నెడుతూ శిఖరాగ్రాన నిలిచంది. అదే (). మరి ఈ స్కీమ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. వాల్యూ రీసర్చ్‌లో లిస్ట్ అయిన మొత్తం 1200 యాక్టివ్ ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్స్‌‌ అనాలసిస్ చేయగా అందులో ఈ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మాత్రమే హైరిటర్న్స్ ఇచ్చింది. (SIP) ద్వారా నెలకు రూ.10 వేల పెట్టుబడిని రూ.1 కోటికిపైగా చేసింది. డైవెర్సిఫైడ్, థెమాటిక్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్ సహా అన్ని కేటగిరీల్లోని ఈక్విటీ పథకాలను విశ్లేషించగా ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కోటీశ్వరులను చేసి చూపించింది. మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో 15 ఏళ్ల పనితీరును కలిగి ఉన్న వాటిలో డైరెక్ట్ ప్లాన్స్ లేవు. అందుకే రెగ్యులర్ ప్లాన్స్‌ని లెక్కలోకి తీసుకున్నట్లు వాల్యూ రీసర్చ్ ద్వారా తెలుస్తోంది. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (Nippon India Mutual Fund) నుంచి పలు స్కీమ్స్ లాంచ్ అయ్యాయి. అందులో చాలా పథకాలు కేటగిరీ సగటును మించి రాబడులు అందించాయి. అయితే, ఈ ఫండ్ హౌస్ వద్ద ఉన్న 127 స్కీమ్స్‌లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ దీర్ఘకాల సిప్ పెట్టుబడులపై ఊహించని రిటర్న్స్ ఇచ్చింది. గత 15 సంవత్సరాల్లో చూస్తే అది సిప్ పెట్టుబడి అయినా, లంప్ సమ్ పెట్టుబడి అయినా సగటు వార్షిక రాబడి 20 శాతానికి పైగా అందించిన ఏకైక స్కీమ్‌గా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ నిలిచినట్లు వాల్యూ రీసర్చ్ వద్ద ఉన్న డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ ఫండ్ 2010 సెప్టెంబర్ 16వ తేదీన లాంచ్ అయింది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టీఆర్ఐగా ఉంది. ప్రాథమికంగా ఇది స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. సిప్ రాబడి 22.68 శాతంగా ఉంది. రూ.10 వేల సిప్ పెట్టుబడి 15 ఏళ్లలోనే రూ.1.21 కోట్లుగా చేసి చూపించింది. ఇక లంప్ సమ్ చూసుకుంటే 21.52 శాతం చొప్పున రాబడి ఇచ్చింది.