ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా తరఫున డెబ్యూ చేయనున్నాడా? ఈ విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి క్లారిటీ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి ముుందు వైభవ్ సూర్యవంశీ పెట్టిన పోస్ట్ ఈ చర్చకు తెరలేపింది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కానీ ప్రాక్టీస్ మాత్రం జోరుగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు.వైభవ్ సూర్యవంశీ పోస్టులో ఏముంది?వైభవ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. అందులో తన ఫొటోపై ‘కొత్త ఛాప్టర్‌’ అని క్యాప్షన్ ఇచ్చిన వైభవ్‌.. దానికి టోర్నడో ఎమోజీని యాడ్‌ చేశాడు. విధ్వంసం సృష్టించడానికి సిద్ధమని ఈ ఎమోజీకి అర్థం. ఇది చూసిన నెటిజన్లు.. యంగ్ సెన్సేషన్ డెబ్యూకి సిద్ధమయ్యాడని.. ఇదే హింట్‌ అని పేర్కొంటున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌లో భారత జెర్సీ ధరించి.. అతడు తొలిసారి బరిలోకి దిగనున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి వైభవ్.. డెబ్యూ చేస్తాడా లేదా అన్నది శనివారం రాత్రి 6.30 గంటలకు తేలిపోనుంది. ఏది ఏమైనా ప్రస్తుతం సూర్యవంశీ చేసిన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే తమ ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది. భారత్ మాత్రం టాస్ సమయంలోనే తుది జట్టును ప్రకటించనుంది.ఐర్లాండ్‌తో సిరీస్‌తో పాటు, గత మ్యాచ్‌లో సంజూ విఫలమయ్యాడు. దీంతో వైభవ్‌కు చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. కానీ టీ20 ప్రపంచప్‌ 2026లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూపై వేటు వేసేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు. కానీ రెండో టీ20లో తిలక్ వర్మ ప్లేసులో వైభవ్‌ను ఆడించాలని జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సంజూ శాంసన్ వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు.