కాపులం ఓట్లేసి గెలిపించుకున్నాం కదా.. ఏమైనా అంటాడు.. పవన్ కళ్యాణ్‌పై సాయికృష్ణ తల్లి ఆగ్రహం

Wait 5 sec.

చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు పవన్ కళ్యాణ్‌కు అభిమాని అని.. తమకు బాగా బుద్ధి చెప్పారంటూ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండవన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విజయలక్ష్మి మండిపడ్డారు. కాపులంతా ఓట్లేసి పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పాడని విమర్శించారు. తన కొడుకు సాయికృష్ణ పవన్ కళ్యాణ్ అభిమాని అని.. అలాంటివాడిని క్రిమినల్ అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుక పెద్దల హస్తం ఉందన్న విజయలక్ష్మి.. ఆ కారణంగానే తన కొడుకును చంపేశారని ఆరోపించారు. తన కుమారుణ్ని తీసుకెళ్లిన వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఈ కేసులో కేవలం నాలుగైదు మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా బయటే ఉన్నారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికీ కూడా సాయికృష్ణ బూడిద ఇవ్వలేదన్న ఆమె.. కనీసం బూడిదైనా ఇప్పిస్తే కార్యక్రమాలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. లేకుంటే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ కేసు వెనుక ఉన్న పెద్దలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గాదె సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణకు విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఎదుట తన అభిప్రాయాలు వినిపించారు. ఈ కేసులో సిట్ విచారణపై విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాదె సాయికృష్ణ కేసులో , ఇద్దరు కానిస్టేబుల్స్, మరో వ్యక్తిని నిందితులుగా సిట్ పేర్కొంది. వీరిని అరెస్ట్ చేసిన సిట్అధికారులు.. రిమాండ్ కోసం జైలుకు తరలించారు. అయితే సిట్ విచారణ జరుపుతున్నప్పటికీ.. సాయికృష్ణ మృతదేహం ఏమైందనే మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తుపై విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు.