యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు బెయిల్.. అంతలోనే షాక్.. మళ్లీ అరెస్ట్!

Wait 5 sec.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన మరో షాక్ తగిలింది. ఈ కేసులో ప్రశ్న రావణ్‌కు ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కాసేపటికే ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తరుఫున ఎలమంచిలి కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో జడ శ్రవణ్ కుమార్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు ప్రశ్న రావణ్. తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన ప్రశ్న రావణ్.. మిగతా విషయాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొనసాగుతున్న ఫిర్యాదులు..మరోవైపు చేశారంటూ మరోచోట పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయనగరంలో జనసేన నేతలు.. ప్రశ్న రావణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత రాధిక నేతృత్వంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదును అందజేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొంతమంది యూట్యూబర్లు సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు చెడు సంకేతాలు పంపుతాయని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్‌ను తొలుత హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం తరలించారు. పిఠాపురంలో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేయగా.. ఆ వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారనే కేసుపై మళ్లీ అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ కాకినాడ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులోనూ ప్రశ్న రావణ్‌కు బెయిల్ రాగా.. ఇంకో కేసులో ఎలమంచిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈలోపే మరో కేసులో ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.