తెలివైన పెట్టుబడి.. రూ. 10 చొప్పున Jioలో షేర్లు కొంటే.. రూ. 5800 కోట్లొస్తున్నాయ్..!

Wait 5 sec.

: భారతీయ కార్పొరేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ ఇష్యూగా భావిస్తున్న జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ ఐపీఓ దిశగా అడుగులు వేగవంతం చేసింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) వద్ద కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) పేర్లను దాఖలు చేసింది. అంశం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ జియో ప్రారంభ దశలోనే పెట్టుబడి పెట్టిన దేశీయ ఇన్వెస్టర్ హెచ్‌పీసీఎల్ (HFCL) ప్రమోటర్ మహేంద్ర నహతా ఒక్కో షేరుకు రూ. 10 చొప్పున కొనుగోలు చేసిన తన పెట్టుబడిపై ఇప్పుడు ఏకంగా 11,983 శాతం అంటే దాదాపు 121 రెట్లు లాభాన్ని ఆర్జించనుంది. అది ఎలాగో ఇప్పుడే మనం తెలుసుకుందాం.హెచ్ఎఫ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర నహతా కుటుంబం (ఆయన కుమారుడు అనంత్ నహతా, కుమార్తె ప్రియాంక సంఘీలతో కలిపి) జులై 7, 2020న జియో ప్లాట్ ఫార్మ్స్‌లో షేర్లను కొనుగోలు చేశారు. కంపెనీ ప్రారంభమైన 8 నెలలకే వారు తాము కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్స్ ను ఈక్విటీ షేర్లుగా మార్చుకోవడం ద్వారా 37.04 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి కేవలం రూ. 10కే దక్కించుకున్నారు. దీనికి తోడు రిలయన్స్ గ్రూప్ మరో 10.83 మిలియన్ల షేర్లను అదే రూ. 10 ధరతో నేరుగా వారికి కేటాయించింది. ఈ విధంగా వారి మొత్తం పెట్టుబడి అప్పుడు రూ. 47.87 కోట్లుగా ఉంది. దీంతో వారికి జియో ప్లాట్ ఫార్మ్స్ లో 0.54 శాతం వాటా లభించింది. జియో ఐపీఓతో అది కాస్తా రూ. 5800 కోట్లుగా మారనుంది. పఆసక్తికరమైన విషయం ఏంటంటే నహతా కుటుంబానికి రూ. 10 చొప్పున షేర్లు కేటాయించిన అదే రోజున, రిలయన్స్ సంస్థ దిగ్గజ మెటాకు ఒక్కో షేరును రూ. 488.34 చొప్పున విక్రయించింది. ఆ తర్వాత గూగుల్, సౌదీ అరేబియాకు చెందిన పీఐఎఫ్, కేకేఆర్ వంటి 13 అంతర్జాతీయ సంస్థలు ఒక్కో షేరుకు గరిష్ఠంగా రూ. 549.31 వరకు చెల్లించి జియోలో వాటాలు కొన్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పెట్టిన భారీ ధరతో పోలిస్తే దేశీయ భాగస్వామి నహతాకు తక్కువ ధరకే వాటా లభించింది. అయితే, తక్కువ ధరకు షేర్లు లభించడం వెనుక 2010 నాటి పెద్ద డీల్ ఉంది. జూన్ 11, 2010న నహతాకు చెందిన ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ దేశవ్యాప్త టెలికాం స్పెక్ట్రమ్ ను రూ. 12,872 కోట్లకు కొన్నది. ఆ విజయం సాధించిన కొన్ని గంటల్లోనే ముకేశ్ అంబానీ ఇన్ఫోటెల్‌లో 95 శాతం వాటాను రూ. 4800 కోట్లకు కొన్నారు. మిగిలిన 5 శాతం వాటా నహతా తన వద్దే ఉంచుకున్నారు. ఆ ఇన్ఫోటెల్ సంస్థే కాలక్రమేణా నేటి రిలయన్స్ జియోగా రూపాంతరం చెందింది. ఆనాటి 5 శాతం భాగస్వామ్యమే నేడు వారికి జాక్‌పాట్ లాభాలను తెచ్చింది.ప్రస్తుతం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కోట్లుగా అంచనా వేసింది. ఈ లెక్కన నహతా కుటుంబానికి ఉన్న 0.54 శాతం వాటా విలువ దాదాపు రూ. 5800 కోట్లకు సమానం కానుంది. సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం రాబోయే ఐపీఓ ద్వారా జియో కేవలం 270 మిలియన్ల కొత్త షేర్లను మార్కెట్లోకి తెస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ లేదు కాబట్టి నహతా కానీ లేదా మెటా, గూగుల్ వంటి ఇన్వెస్టర్లు కానీ తమ వాటాలను ఇప్పుడు విక్రయించడం లేదు. ఐపీఓ లిస్టింగ్ తర్వాత ఈ సంపద మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.