అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు అరుదైన గౌరవం అందుకున్న రోహిత్ శర్మ..!

Wait 5 sec.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును మంగళవారం (జూన్‌ 23, 2026)న అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోహిత్‌కు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ ఏడాది జనవరిలోనే రోహిత్‌ శర్మతోతో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ గత నెలలో అవార్డు అందుకోగా, వ్యక్తిగత కారణాలతో అప్పుడు హాజరుకాలేకపోయాడు. దీంతో ఇప్పుడు అతడు పురస్కారం అందుకున్నాడు.తన సారథ్యంలో భారత క్రికెట్ జట్టుకు టీ20 ప్రపంచకప్‌ 2024, రోహిత్ శర్మ పద్మశ్రీకి ఎంపికయ్యాడు. భారత క్రికెట్‌కు విశేష సేవలందించినందున అతడిని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవించింది. నలుపు రంగు సూట్‌లో వచ్చిన రోహిత్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నమర్కించి పురస్కారం అందుకున్నాడు. అవార్డు తీసుకునేందుకు వెళ్తే.. తిరిగి వచ్చే క్రమంలోనూ రోహిత్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమర్కించాడు.పద్మశ్రీ అందుకున్న భారత క్రికెట్ ప్రముఖుల జాబితాలో ఇక.. రోహిత్ కూడా చేరాడు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోని వంటి దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. రోహిత్ శర్మ సరిగ్గా 19 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 2007లో జూన్ 23న భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. 19 ఏళ్ల తర్వాత ఇదే రోజు పద్మశ్రీ అందుకున్నాడు.రోహిత్ శర్మ.. టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పి.. భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన హిట్‌మ్యాన్.. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడటమే లక్ష్యంగా అతడు ముందుకెళ్తున్నాడు.