సమంత - రాజ్ జంటకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు.. ‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు మెగా అభినందనలు

Wait 5 sec.

సమంత కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు క్రియేటర్ గా, నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో మంచి విజయం సాధించిన బంగారం టీమ్ కి మెగాస్టార్ ప్రశంసలు దక్కాయి.‘మా ఇంటి బంగారం’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. నందిని రెడ్డి, సమంత - రాజ్ నిడిమోరు జంట సోమవారం సాయంత్రం చిరుని కలిశారు. ఈ సందర్భంగా సామ్ - రాజ్ జంటకు చిరంజీవి - సురేఖ దంపతులు సారె పెట్టారు. చీరతో పాటుగా ఒక శంఖాన్ని అందించారు. వారితో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ మెగా ‘బంగారం’ మూమెంట్ కు సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో సమంత బేబి బంప్‌తో కనిపించడంతో, ఆమె తల్లి కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే సామ్‌ గుడ్‌ న్యూస్‌ను చెప్పబోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి - సురేఖ దంపతులు.. సమంత - రాజ్ జంటకు సారె పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.