భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బ్రూక్.. కొత్త ప్లేయర్‌కు ఛాన్స్!

Wait 5 sec.

భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచే ఇరు జట్ల మధ్య ఇంగ్లాండ్ వేదికగా ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం తాజాగా ఇంగ్లాండ్ సైతం స్క్వాడ్‌ను ప్రకటించింది. సారథిగా ఇంగ్లాండ్ వేల్స్ బోర్డు 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ బెన్ డకెట్‌పై వేటు పడగా.. సకీబ్ మహమూద్, జోర్డన్ కాక్స్, బేకర్ తిరిగి స్క్వాడ్‌లోకి వచ్చారు. జేమ్స్ కొలెస్ తొలిసారి టీ20లకు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2026తో పాటు.. ఐపీఎల్ 2026లోనూ పెద్దగా రాణించలేకపోయిన జోస్ బట్లర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. అతడితో పాటు ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, సామ్ కర్రన్ లాంటి సీనియర్లకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. యంగ్ ప్లేయర్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ తమ స్థానాలను నిలుపుకున్నారు.భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సొన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్స్, జోర్దాన్ కాక్స్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీఇంగ్లాండ్ vs భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20: జులై 1,చెస్టర్ లీ స్ట్రీట్రెండో టీ20:జులై 4, మాంచెస్టర్మూడో టీ20: జులై 7, నాటింగ్ హామ్నాలుగో టీ20: జులై 9, బ్రిస్టోల్ఐదో టీ20: జులై 11, సౌథాంప్టన్