'బెదిరింపులకు భయపడేదే లేదు'.. ట్రంప్ వార్నింగ్‌కి ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!

Wait 5 sec.

అమెరికా - ఇరాన్ మధ్య ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే.. మరోవైపు మాటల యుద్ధం కూడా మొదలైంది. హెజ్బొల్లాను అదుపులో పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే, ఆ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదంటే ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. స్విట్జర్లాండ్ వేదికగా కీలక చర్చలు కొనసాగుతున్న వేళ, ఎక్స్ వేదికగా ఇరుదేశాల మధ్య మాటల దాడి కొనసాగడం ఆసక్తిగా మారింది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో "లెబనాన్‌లో హిజ్బుబ్లా తమకు సమస్యలు సృష్టిస్తోంది. అలాంటి వారికి ఆర్థిక సాయం చేయడాన్ని ఇరాన్ వెంటనే ఆపాలి. లేకపోతే గత వారం చేసినట్లు మళ్లీ ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం. ఈసారి మరింత గట్టి దాడులు చేస్తాం" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అమెరికా బెదిరింపులకు తామేమీ భయపడమని, నిజంగా బెదిరింపులకు తాము భయపడి ఉంటే అమెరికా శాంతి చర్చల వరకూ వచ్చేది కాదని చెప్పారు. ఈ బలగాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే ఈ సారి భీకర దాడులకు దిగుతామంటూ హెచ్చరించారు. "అమెరికా బెదిరింపులకు మేము పట్టించుకోము. ఆ బెదిరింపులు పనిచేసి ఉంటే వారు ఈ పరిస్థితికి వచ్చేవారు కాదు. మా సాయుధ బలగాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఈసారి భిన్నమైన రీతిలో ప్రతిస్పందిస్తాం. అమెరికా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. కానీ చర్యలు తీసుకునేది మేమే" అని ఘాలిబాఫ్ వార్నింగ్ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లోని రిసార్ట్‌లో అమెరికా - ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలను చారిత్రాత్మక సమావేశంగా అభివర్ణించారు. అమెరికా - ఇరాన్ సంబంధాల్లో ఇదో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు. మిడిల్ ఈస్ట్‌లో శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని వాన్స్ అన్నారు. ఈ శాంతి చర్చలకు పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.