ఆంధ్రప్రదేశ్‌లో పురాతన ఆలయంగా, దేశంలో మొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయం గురించి తెలిసిందే. 10 రోజుల క్రితం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురించి అనంత్ అంబానీకి వివరించారు. వెంటనే స్పందించిన అనంత్ అంబానీ శ్రీకాళహస్తి, పనులకు తమ వంతుగా నిధులు, సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. తాజాగా అనంత్ అంబానీ అందించే విరాళంపై గుడిమల్లం ఆలయ పాలకమండలి ఛైర్మన్ గిరినాయుడు కీలక ప్రకటన చేశారు. కి ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌అంబానీ రూ.25కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు గిరినాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అనంత్ అంబానీ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారని.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి గుడిమల్లం ఆలయ అభివృద్ధికి ఆర్ధికసాయం కోరిన విషయాన్ని గుర్తు చేశారు. గుడిమల్లం ఆలయానికి అనంత్‌ అంబానీ వెంటనే రూ.25కోట్లు విరాళం ప్రకటించినట్లు గిరినాయుడు తెలిపారు. ఈ విరాళంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు గిరి నాయుడు.శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధి కోసం అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధికి 10 కోట్లు, ఆలయంలో సెంట్రల్ ఏసీ ఏర్పాటుకు 3 కోట్లు, దేవస్థానం అనుబంధ గోశాల అభివృద్ధికి 5 కోట్లు విరాళంగా అందించనున్నట్లు సమాచారం. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయ అభివృద్దికి రూ. 25 కోట్లు.. అవసరమైతే మరో రూ.10 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని అనంత్ అంబానీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రిలయన్స్ గ్రూపు నుంచి శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయానికి భారీ విరాళాలు అందించనున్నారు. త్వరలోనే ఈ విరాళాలు రెండు ఆలయాలకు అందించనున్నట్లు సమాచారం.