నేను అలాంటి వ్యక్తినైతే బాలినేని జనసేన పార్టీలోకి ఎందుకు వస్తారు.. పవన్ కళ్యాణ్

Wait 5 sec.

తాను కులాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదన్నారు జనసేన పార్టీ అధినేత . కొంతమంది తాను కులాల ప్రస్తావన తీసుకొస్తానని.. మాట్లాడతానని ఎదురుచూస్తున్నారన్నారు. తనకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వం లేదని.. అలాగే వైఎస్సార్‌సీపీతో కూడా వ్యక్తిగతంగా శత్రుత్వం లేదన్నారు. తాను విధానపరంగా ఆ పార్టీని, నేతల్ని ప్రశ్నిస్తుంటే పాలసీ పరంగా మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. సీకే కన్వెన్షన్ హాల్‌లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదన్నారు. మౌనంగా ఉన్నామని ఒక్కోసారి పేట్రేగిపోతారని.. కాబట్టి తాము కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.నిజంగా తాను ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే మాజీ మంత్రి జనసేన పార్టీలోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తాను అందరి కోసం పని చేస్తాడు అనే నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడింది చూసానన్నారు.. అటువంటివి సమర్ధించు అన్నారు. 'మీరు ఎంత ఎక్కువ మాట్లాడారో చెప్పాలా ? మీరు మాట్లాడిన వీడియోలు మీకు పంపాలా ? నానాజీ మాట్లాడిన దాన్ని ఎంకరేజ్ చెయ్యం, కాకపోతే మీరు ఎంత దారుణమైన భాష మాట్లాడారు?. గతంలో పంతం నానాజీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఏం మాట్లాడారు. మేము మర్చిపోయాం అనుకుంటున్నారా ? అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీ ఇష్టానికి మాట్లాడేస్తారా ?. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా భాష గురించి?' అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.'అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా ఇంకా ఇష్టానికి నోటికొచ్చినట్టు దూషిస్తున్నారు. 11 వచ్చినా భాష విషయంలో మేము తగ్గం అంటున్నారు.. ఇంకా తగ్గకండి మీకు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి. అసలు మీలో రియలైజేషన్ ఎంతవరకు వస్తుందో మేమూ చూస్తాం. సరే ఇప్పటికైనా బుద్ధి వస్తే సంతోషం, మీరు మమ్మల్ని తిట్టకుండా ఉంటే మా పార్టీ నిర్మాణానికి చాలా సమయం ఉంటుంది. మీకు బదులు ఇవ్వడం మానేసి మా పార్టీ నిర్మాణం పైనే దృష్టి మొత్తం పెట్టుకుంటాం. లేదు మీరు తిట్టాల్సిందే అంటే మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారెంటీ' అన్నారు పవన్ కళ్యాణ్.'ఉచితాలు ఎవరికి కావాలి నిజంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ఉచితాలు కావాలి. సంక్షేమ పథకాలకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ పథకాలు మీదే మనం ప్రభుత్వాన్ని నడుపుతాం ఓట్లు పడిపోతాయి అంటే, అలా ఓట్లు పడవు అనడానికి నిలువెత్తు ఉదాహరణ వైసీపీనే. మేము బటన్ నొక్కేస్తాం, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు వదిలేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక తపన పడుతున్నాం. హుద్ హుద్ తుఫానప్పుడు మేము వెళ్తుంటే ఒక అబ్బాయి మాకు 25 కేజిల బియ్యం కాదన్నా 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అన్నాడు. అంటే యువత తాలూకు కోపాలు అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు జీవనం అడుగుతున్నారు, కేవలం ఉచితాలు అడగట్లేదు' అంటూ వ్యాఖ్యానించారు జనసేనాని.