తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారా?.. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారా?.. విజయ్‌ను ఆహ్వానిస్తూ ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ వీడియోలు సోషల్ మీడియాలో నిజమెంత?. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ హోర్డింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 'తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆహ్వానిస్తు్న్నాము.. KIET' పేరుతో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. చుట్టపక్కల షాపులకు తెలుగులో పేర్లు రాసి ఉన్నాయి. ప్రస్తుతం 12 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీకి వస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇంతకీ తమిళనాడు సీఎం విజయ్ నిజంగానే కాకినాడ వస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కానీ విజయ్ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు కాలేజీ యాజమాన్యం నుంచి కానీ, ఇటు తమిళనాడు సీఎంవో నుంచి కానీ ఏపీ పర్యటన ఖరారైనట్లు అధికారికంగా సమచారం లేదనే చర్చ కూడా జరుగుతోంది. కాలేజీ యాజమాన్యం మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసిందా అనే కొందరు చర్చించుకుంటున్నారు. మరి తమిళనాడు సీఎం ఏపీ పర్యటనపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. కాకినాడ కైట్ కాలేజీ ఈ హోర్డింగ్‌ ఏర్పాటుపై స్పష్టత ఇస్తేనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పర్యటన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది.. అనేక నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలనాపరమైన అంశాలతో విజయ్ బిజీగా ఉన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. టీవీకే పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు విజయ్ సినిమాలు ఏపీలో విడుదలయ్యేవి.. దీంతో ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.