బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్- సుకన్య సమృద్ధి సహా ఫుల్ లిస్ట్ ఇదే- కనీస పెట్టుబడి, వడ్డీ రేట్లు ఇవే.. ​

Wait 5 sec.

SSY Interest Rate July September: పెట్టుబడుల విషయంలో చాలా మంది రిస్క్ ఫ్యాక్టర్ ముందుగా చూస్తారు. ఇక్కడ ఏ పథకంలో పెట్టుబడి పెడితే గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి.. వేటిల్లో రిస్క్ ఉంటుందనేది తెలుసుకుంటారు. చాలా వరకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే కచ్చితంగా ఇక్కడ రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రిస్క్ లేకుండా మంచి రాబడి అంటే ముందుగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్, పోస్టాఫీస్ పథకాలు, ఇంకా ఆర్బీఐ బాండ్లు వంటివి ఉంటాయి. ఇవి సురక్షిత పెట్టుబడి పథకాలు. నిర్దిష్ట వడ్డీ రేట్ల ఆధారంగా కచ్చితమైన రిటర్న్స్ ఉంటాయి. ఇందులో ఇటీవలి కాలంలో బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు చాలా వాటిల్లో తగ్గుముఖం పట్టి కనిష్ఠాలకు చేరాయి. ఇక్కడే ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ఆర్బీఐ రెపో రేట్లన తగ్గిస్తూ వచ్చినా పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు తగ్గలేదు. అలా అని పెరగనూలేదు. కానీ ఇప్పటికే బ్యాంక్ ఎఫ్‌డీలతో పోలిస్తే ఆకర్షణీయంగానే ఉన్నాయి.ఇప్పుడు ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. ఈ నెలాఖరున కేంద్రం జులై- సెప్టెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్లు ప్రకటించనుంది. చాలా కాలంగా వడ్డీ రేట్లు మార్చట్లేదు. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఏ పోస్టాఫీస్ పథకంలో వడ్డీ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి.. దేంట్లో కనీస పెట్టుబడి ఎంత, కాల పరిమితి ఎంత ఇలాంటి వివరాల్ని తెలుసుకుందాం.పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్- వడ్డీ రేటు 4 శాతంగా ఉండగా, కనీస పెట్టుబడి రూ. 500 గా ఉంది. గరిష్ఠ పరిమితి లేదు.పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్- వడ్డీ రేటు 6.7 శాతంగా ఉండగా ఐదేళ్లు కాల వ్యవధిగా ఉంది. రూ. 100 తో పెట్టుబడి ప్రారంభించొచ్చు. గరిష్ట పరిమితి లేదు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల పరిమితితో ఉంటాయి. ఇక్కడ వడ్డీ రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతంగా ఉండగా కనీస పెట్టుబడి రూ. 1000 తో చేరొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500, గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. వరుసగా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- ఇక్కడ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉండగా కనీసం రూ. 1000 తో ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. కాల పరిమితి ఐదేళ్లుగా ఉంది.కిసాన్ వికాస్ పత్ర- వడ్డీ రేటు ఇక్కడ 7.5 శాతంగా ఉంది. కనీసం రూ. 1000 తో పెట్టుబడి ప్రారంభించొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. 115 నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుంది.మంత్లీ ఇన్‌కం స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతంగా ఉండగా కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరొచ్చు. సింగిల్ అకౌంట్‌కు గరిష్ఠంగా 9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఐదేళ్ల కాల పరిమితి.సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్- వడ్డీ రేటు 8.2 శాతంగా ఉండగా, కనీసం రూ. 1000 తో పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు జమ చేయొచ్చు. ఐదేళ్లు కాల పరిమితి. ఒక్కసారి పెట్టుబడితో ఐదేళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ డబ్బులు వస్తాయి.సుకన్య సమృద్ధి యోజన- ఇది ఆడపిల్లల కోసమే ఉన్న స్పెషల్ స్కీమ్. పదేళ్లలోపు వారు చేరేందుకు అర్హులు. వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. ఇక్కడ కూడా వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాలి. మెచ్యూరిటీ 21 ఏళ్లకు వస్తుంది.