రూ. 45 వేల జీతం వస్తున్నా వెంటనే అకౌంట్ నిల్ అవుతుందా? ఈ సింపుల్ బడ్జెట్ ప్లాన్‌‌తో తప్పక మారతారు!

Wait 5 sec.

: ఒకటో తేదీన జీతం అకౌంట్లో పడటం.. వచ్చీ రావడంతోనే ఈఎంఐలు, అద్దె, బిల్లులకు ఆవిరైపోవడం.. నెలాఖరు వచ్చే సరికి అకౌంట్ మొత్తం ఖాళీ అవడం.. చేతిలో చిల్లిగవ్వ లేక క్రెడిట్ కార్డులపై ఆధారపడటం.. ఇదీ ఈ రోజుల్లో మెట్రో నగరాల్లో రూ. 45 వేల వరకు జీతం వచ్చినా మెజార్టీ మధ్యతరగతి యువతీ యువకుల అసలు పరిస్థితి. రూ. 45 వేల జీతం అనే కాదు ఎంత జీతం వస్తున్నా ఖర్చులు అదే స్థాయిలో ఉంటాయి. అయితే వారికి కాస్త పెట్టుబడి ప్రణాళికలు ఉంటాయి. అందుకే ఎంత జీతం వచ్చినా అందులో ఆర్థిక ప్రణాళిక ముఖ్యం అని చెబుతున్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ సునీల్ గుర్జార్. జీతం ఎంతన్నది ముఖ్యం కాదు. దానిని ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ఉదాహరణకు రూ. 45 వేలు సంపాదించే వ్యక్తి ప్రతి రూపాయిని ఎలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలో ఆయన ఇచ్చిన ఒక బడ్జెట్ టేబుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ ఏంటి. దీనిని నిజజీవితంలో అప్లై చేస్తే చాలా పొదుపు చేయడం, అన్ని అవసరాలు తీరడం, భవిష్యత్తుకు కూడా ఆదా చేయడం గమనించొచ్చు.నెలకు చేతికి రూ. 45 వేల జీతం వస్తే ఇక్కడ భవిష్యత్తుకు భద్రత, ప్రస్తుత అవసరాలు తీరేలా ఎలా విభజించారో చూద్దాం. మెట్రో లేదా టైర్- 2 సిటీల్లో షేరింగ్ లేదా సింగిల్ రూమ్ అద్దెకు రూ. 10 వేలు. ఇది జీతంలో 22 శాతం వరకు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు 18 శాతం- రూ. 8 వేలు (దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం)తల్లిదండ్రులకు 17 శాతం- రూ. 7500 (కుటుంబ బాధ్యతలు, ఊర్లో అమ్మనాన్నల కోసం)కిరాణా, ఫుడ్ (గ్రాసరీస్, బయట తినడం)- 13 శాతం- రూ. 6 వేలు (నెలవారీ సరకులు, బయట అప్పుడప్పుడు తినడం)ఇతర ఖర్చులు - 9 శాతం- రూ. 4 వేలు (బట్టలు, షాపింగ్ లేదా వీకెండ్ సరదా)ప్రయాణ ఖర్చులు- 7 శాతం- రూ. 3 వేలు (ఆఫీస్‌కు ప్రయాణం లేదా బైక్ పెట్రోల్ ఖర్చులు)గోల్డ్ సేవింగ్స్- 4 శాతం - రూ. 2 వేలు (డిజిటల్ గోల్డ్ లేదా ఇతర సురక్షిత భవిష్యత్తు పొదుపు)ఎమర్జెన్సీ ఫండ్- 4 శాతం- రూ. 2 వేలు (ఊహించని ఖర్చులు లేదా మెడికల్ అవసరాల కోసం)కరెంట్, వైఫై బిల్స్ - 3 శాతం- రూ. 1500 (ఎలక్ట్రిసిటీ, మొబైల్ రీఛార్జ్, బ్రాడ్‌బ్యాండ్)టర్మ్ ఇన్సూరెన్స్ - 3 శాతం- రూ. 1000 (మనల్ని నమ్ముకున్న కుటుంబానికి లైఫ్ సెక్యూరిటీ)మొత్తం రూ. 45000- 100 శాతం (పర్‌ఫెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్)చాలా పెద్ద మొత్తం సంపాదిస్తేనే ధనవంతులు అవుతామనేది అపోహ మాత్రమే. నెలకు చాలా తక్కువ జీతం వచ్చినా ఉదాహరణకు మీకు నెలకు రూ. 45 వేలు వచ్చినా, పక్కా ప్లాన్, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఏ జీతంతో అయినా అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని దీనిని బట్టి అర్థం అవుతుంది. అంతకంటే జీతం ఎక్కువ, తక్కువ ఉన్నా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకునేందుకు ఇలాంటివి మార్గనిర్దేశం చేస్తాయి.