పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వాన్ని తెలిపే ఆధారం కాదంటూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుపై.. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే చేశారు. పాస్‌పోర్టు పౌరసత్వానికి ఆధారం కాదంటే.. బీజేపీ సభ్యత్వమే భారత పౌరసత్వం అవుతుందా అంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి ఘాటుగా స్పందించారు. పాస్‌పోర్టు, పౌరసత్వం విషయంలో.. .. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాస్‌పోర్టు, పౌరసత్వం మధ్య ఉన్న చట్టపరమైన తేడాలను అర్థం చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీకి కిషన్ రెడ్డి హితవు పలికారు. ఒక ఎంపీ, ఒక లాయర్‌ అయిన అసదుద్దీన్ ఒవైసీ.. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ముందు.. పౌరసత్వ చట్టం 1955.. పాస్‌పోర్ట్ చట్టం 1967లను మరోసారి అధ్యయనం చేయాలని ఎద్దేవా చేశారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు.. చట్టంపై ఆయనకు ఉన్న అవగాహన లోపాన్ని.. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను ఆందోళనకు గురిచేసే ప్రయత్నాలను తెలుపుతున్నాయని ఆరోపించారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం.. భారత పాస్‌పోర్టుకు విలువలేదని అర్థం కాదని పేర్కొన్న కిషన్ రెడ్డి.. పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వానికి తుది ఆధారం కాదని తెలిపారు. పౌరసత్వం అనేది.. భారత రాజ్యాంగం, పౌరసత్వ చట్టం 1955 ప్రకారమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. పాస్‌పోర్ట్ చట్టం 1967లోని సెక్షన్ 20 ప్రకారం ప్రజాహితం దృష్ట్యా భారత పౌరుడు కాని వ్యక్తికి.. పాస్‌పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి ఉదాహరణలు గతంలో కూడా ఉన్నాయని.. అందుకే పాస్‌పోర్టును మాత్రమే పౌరసత్వానికి ఆధారంగా పేర్కొనలేమని అన్నారు.అయితే ఇదేమీ కొత్త రూల్ కాదని.. 1967లో కాంగ్రెస్ హయాంలో అమల్లోకి వచ్చిన చట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 60 ఏళ్ల చట్టాన్ని మోదీ సర్కార్‌పై నెట్టడం అవగాహన లోపమో లేదా నిజాలను వక్రీకరించే ప్రయత్నం అవుతుందని ఎద్దేవా చేశారు. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు లేదా నేచురలైజేషన్ ద్వారా భారత పౌరసత్వం లభిస్తుందని తేల్చి చెప్పారు. 2013లో బాంబే హైకోర్టు తీర్పులోనూ పాస్‌పోర్టు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరసత్వాన్ని నిరూపించడానికి సరిపోవని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.