ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఉందని దీని కారణంగా.. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ, భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి సహా మిగిలిన జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు పడవచ్చు.జూన్ 28న కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపుల ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. జూన్ 29 వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉంది. ఆ తర్వాత జూన్ 30 వరకు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయి. జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.