'నెతన్యాహూతో సహా అన్ని సమస్యలు నేనే పరిష్కరిస్తా'.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్!

Wait 5 sec.

ఇరాన్‌తో అమెరికా యుద్ధానికి దిగడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్.. అలాంటిది ఇప్పుడు ఆ ఇజ్రాయెల్‌పైనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్‌పై సైనిక చర్యలు చేపట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్‌లోని భద్రతా మండలిలో తమ సైన్యం కొనసాగుతుందని ప్రకటించడంపై ట్రంగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమస్యను కూడా తానే పరిష్కరిస్తానని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న అమెరికా - ఇరాన్ చర్చలకు ఇజ్రాయెల్ చర్యలు ఆటంకం కలగకుండా ఎలా చూస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. ట్రంప్ ఇన్‌డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. "నేను సమస్యలను పరిష్కరించే వ్యక్తిని. చాలా వేగంగా సమస్యలను పరిష్కరిస్తాను. బీబీ విషయంలో కూడా అలాగే చేస్తాను" అని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం లెబనాన్‌లో తమ సైన్యం కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేశారు. తమ ప్రజల భద్రత కోసం ఎంతకాలం అవసరమైతే అంతకాలం దక్షిణ లెబనాన్ భద్రతా మండలిలో ఉంటామని చెప్పారు. ఏ దేశమైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇదే చేస్తుందని, ఇజ్రాయెల్ కూడా అలాగే చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. తాను ప్రధానిగా పదవిలో ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాలను పొందలేదని, పొందనివ్వబోమని నెతన్యాహూ స్పష్టం చేశారు. చర్చలు సఫలమైనా, విఫలమైనా తాను ఉన్నంతకాలం ఇరాన్‌కు అణ్వాయుధాను ఉండవు అని చెప్పారు. అమెరికా కూడా ఇదే పరిస్థితిలో ఉంటే సరిహద్దులు దాటి ఉగ్రవాదులను నిర్మూలించేదని నెతన్యాహూ అన్నారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత నుంచి అమెరికా - ఇజ్రాయెల్ మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు బయటపడ్డట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల విషయంలో ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తాను చెప్పినట్టు చేస్తుందని ట్రంప్ అంటే.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ స్వతంత్ర దేశాలు.. తమ తమ జాతీయ ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాయని బెంజమిన్ నెతన్యాహూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది.