అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ ముగిసింది. భారత జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇందులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ.. టీమిండియా జట్టును ఎంపిక చేసింది. కానీ మ్యాచ్‌లకు మూడు రోజుల ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్‌రౌండర్‌ కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు.ఇప్పటికే మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20 జట్టు నుంచి వైదొలగగా.. తాజాగా తొడ కండరాల గాయం కారణంగా ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లతో టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. దీంతో ఈ సిరీస్‌లుకు నితీశ్ ప్లేసులో బీసీసీఐ సూర్యాంశ్‌ షెడ్జెను ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.అప్ఘాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతూ.. నితీశ్ రెడ్డి గాయపడ్డాడు. నిజానికి నితీశ్‌కు చిన్నదెబ్బే తగిలిందని అంతా భావించారు. కానీ ఎమ్మారైలో అసలు విషయం తెలిసింది. తొడ కండరాలకు గాయమైందని.. అతడు కోలుకునేందుకు నాలుగు వారాల టైమ్ పడుతుందని సమాచారం.ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లకు భారత జట్టు ఇదే..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబె, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యాంశ్‌ షెడ్జె.భారత్ vs ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20: జులై 26, బెల్‌ఫాస్ట్‌, సివిల్ సర్విసెస్ క్లబ్‌రెండో టీ20: జులై 28, బెల్‌ఫాస్ట్‌, సివిల్ సర్విసెస్ క్లబ్‌భారత్ vs ఇంగ్లాండ్ 20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20: జులై 1, చెస్టర్ లె స్ట్రీట్రెండో టీ20: జులై 4, మాంచెస్టర్మూడో టీ20: జులై 7, నాటింగ్ హామ్నాలుగో టీ20: జులై 9, బ్రిస్టోల్ఐదో టీ20: జులై 11, సౌథాంప్టన్