మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత జనసేన పార్టీలో చేరేందుకు ఒక కండిషన్ పెట్టారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే . పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తేనే ముద్రగడ జనసేన పార్టీలో చేరతానన్నారని.. అదే ముద్రగడ ముద్రగడ వైఎస్సార్‌‌సీపీలో చేరడానికి జగన్ ఇంటికి వెళ్లారని విమర్శించారు. తాను పద్మనాభం ఇంటికి వెళ్లి కలిశానని తన ఇంటికి పవన్ కళ్యాణ్ రావాలి.. వచ్చిన తర్వాత చేరతానని తనతో చెప్పారన్నారు. ఆయనకు మనసులో రావాలని లేదని.. బయటకు మాత్రం కండిషన్ పెట్టారని.. తమకైతే కండిషన్, జగన్‌ దగ్గర మాత్రం కండిషన్ లేదా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో తాను జనసేన పార్టీ నేతలతో కలిసి ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లామన్నారు బొలిశెట్టి. ముద్రగడను జనసేన పార్టీలోకి ఆహ్వానించామని.. తాను పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి చేరనని.. ఆయన తన ఇంటికి వస్తే చేరతానని పద్మనాం స్వయంగా తనతో చెప్పారన్నారు. ముద్రగడ చెప్పిన మాటల్ని పవన్ కళ్యాణ్‌కు చెప్పానని.. పద్మనాభం ఎక్కడా జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చి చేరతానని చెప్పలేదన్నారు. ఈ విషయాన్ని బిడ్డల సాక్షిగా చెబుతున్నానని.. తాను అబద్దాలు చెప్పనన్నారు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఢిల్లీ వెళ్లారు.. ఆ సమయం కలిసిరాలేదన్నారు. తాము ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరతారని చెప్పిన మాట కూడా వాస్తవమేనని.. కానీ ఆ తర్వాత పరిస్థితుల వల్ల చేరలేదన్నారు. కాపు సంఘం నేత దాసరి రాము ఇటీవల తన పేరు ప్రస్తావించి విమర్శించారని.. అందుకే బాధ కలిగిందన్నారు. అందుకే తాను ఈ విషయాలను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు బొలిశెట్టి శ్రీనివాస్. పెట్టారని.. ఇష్టంలేనిది ఎందుకని మేము వదిలేశామన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ముద్రగడ బలమైన వ్యక్తని తానే పవన్ కళ్యాణ్‌తో చెప్పానని.. తాను వెళ్లి పార్టీలో చేరమని అడిగానని.. పవన్ కళ్యాణ్ వెళ్లమని చెప్పలేదని.. కాకపోతే ఆయన అనుమతి తీసుకోని వెళ్లానన్నారు. ఈ విషయాలన్నీ ముద్రగడ కుమారుడు గిరికి కూడా తెలుసన్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మొన్నటి వరకు జనసేన పార్టీలో రజిని పనిచేశారని.. ఇప్పుడు ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది అన్నారు. దాసరి రాము మాత్రం ఆ కోవకు చెందిన వ్యక్తి కాదని.. తనకు గుర్తింపు రాలేదని ఇలా మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు. కాపు నాయకుల ముసుగులో కొందరు తిట్టడం దురదృష్టకరమని.. ఏం చెప్పినా చెబితే నమ్ముతారనుకుంటే సరికాదన్నారు. ముద్రగడ ఆరోగ్యం బాలేదని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.