ఐర్లాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో టీమిండియాలో కీలక మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి మళ్లీ మొండిచేయే!

Wait 5 sec.

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో భారత్ పరువు కోసం పాకులాడుతోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిపాలయింది. వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌పై దారుణ ఓటమిపాలయింది. దాంతో సిరీస్ డిసైడర్ అయిన రెండో మ్యాచ్‌లో భారత్ కీలక మార్పులు చేసింది. పదిహేనేళ్ల యువ తేజం వైభవ్ సూర్యవంశీకి మరోసారి మొండిచేయే మిగిలింది. బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుంచి బయటకు పంపారు. ఆ స్థానంలో యువ ఆటగాడు సూర్యాన్షు షెడ్జే, ప్రిన్స్ యాదవ్‌కి ప్లేస్ దక్కింది. ఈ ఇద్దరికీ టీ20ల్లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటింగ్‌కి అంచనా వేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని కెప్టెన్ తెలిపాడు. ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకోగా.. ఐర్లాండ్ మాత్రం విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగింది. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ ప్రిన్స్ మాత్రం తనదైన శైలితో రాణించి టీమిండియాలో చోటుదక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున కీలక ప్రదర్శన చేసిన సూర్యాన్షు షెడ్జేకి టీమిండియా క్యాప్ దక్కింది. భారత జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాన్షు షెడ్జే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్. ఐర్లాండ్ జట్టుటిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కన్ టక్కర్ (వికెట్ కీపర్ / కెప్టెన్), బెన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్‌రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూంద్రా, మాథ్యూ హోల్డర్.