రాహుల్ గాంధీ నుంచి ఆ విషయంలో స్ఫూర్తి పొందా.. ఆ ఘటన నన్ను రాజకీయాల్లోకి నడిపించింది: లోకేష్

Wait 5 sec.

గతంలో దేశవ్యాప్తంగా తర్వాత తానే ఎక్కువగా ట్రోల్ అయ్యానన్నారు మంత్రి . తాను ఏ రోజూ ట్రోల్స్‌‌కు భయపడలేదని.. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. రాహుల్ పాదయాత్రను చూసి తాను స్ఫూర్తి పొందానని.. పాదయాత్ర చేసిన ఆ అనుభవాలను మర్చిపోకుండా తాను పుస్తకరూపంలోకి తెచ్చానన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలు నిర్వహించిన కాంక్లేవ్‌లో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శల్ని, ట్రోల్స్‌ను సానుకూలంగా తీసుకుంటానన్నారు లోకేష్. తాను యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు గురించి తెలుసుకున్నానన్నారు.. ఆ తర్వాత 2024లో కూటమి ఘనవిజయం సాధించిందన్నారు. తాను స్టాన్‌ఫర్డ్‌లో చదువుకోవడానికి వెళ్లకముందే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని.. అనంతరం ఏడాది తర్వాత చంద్రబాబుతో కలిసి ఒక పెళ్లికి వెళితే.. అక్కడ ఉన్నవాళ్లంతా ఆయన లోపలికి వెళ్లగానే లేచి నిలబడ్డారన్నారు. రాజకీయాల్లోనే ఇంతటి గౌరవం దక్కుతుందని తనకు అప్పుడు అర్థమైంది అన్నారు. అలా చంద్రబాబుకు ఉన్న గౌరవం తనను కూడా రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. టీడీపీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ డాక్టర్లు, ఇంజినీర్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలలో 50శాతం, 17మంది మంత్రులు మొదటిసారి గెలిచినవారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. చంద్రబాబు బ్రాండ్‌తోనే పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయని.. ఆయన ఆలోచనల్ని అమలు చేయడమే తన విధిగా చెప్పుకొచ్చారు.కేంద్రంలో గొంతు బలంగా వినిపించాలంటే ఎక్కువ మంది ఎంపీలు కావాలన్నారు. తాము కేంద్రం తీసుకొచ్చిన విధానాలతో పరుగెడుతున్నామని.. మిగిలిన రాష్ట్రాలు పట్టించుకోని సమయంలో తాము రక్షణ మంత్రి దగ్గరకు వెళ్లి ఏపీలో యుద్ధ విమానాల ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కేంద్రానికి భూమి కేటాయించామని.. కేంద్రం కూడా తమలాంటి రాష్ట్రాల కోసం చూస్తోందన్నారు. కేంద్రం అమరావతికి రూ.12 నుంచి 13 వేల కోట్లు ఇచ్చిందన్నారు. 2028 నాటికి అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతానికి ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లు కూడా వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఒక ఎకనమిక్‌ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము 2024లో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేప్పుడు దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమని భావించామన్నారు లోకేష్. తాము ఆ సమయంలో ఎలాంటి షరతులు పెట్టలేదని.. ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఒకవేళ ఏవైనా విధానాల విషయంలో అభిప్రాయభేదాలుంటే కూర్చుని చర్చల ద్వారా మాట్లాడుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ ఉండదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తి చేశామని.. 37 రోజుల్లోనే పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు భూమి పరిశీలన నుంచి శంకుస్థాపన వరకు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇది తమ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శమన్నారు. దేశానికి వచ్చి మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25శాతం ఆకర్షించగలిగిందన్నారు మంత్రి లోకేష్.