'ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నేనేం చేయాలో అది చేస్తా'..ట్రంప్ డేంజర్ వార్నింగ్

Wait 5 sec.

స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన అమెరికా - ఇరాన్ శాంతి చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పంద నిబంధనలు ఇరాన్ పాటించకపోతే అవసరమైన చర్యలు తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించకపోయినా, సరిగా పాటించకపోయినా చేయాల్సింది చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అమెరికాను గౌరవిస్తూ ఒప్పందాన్ని పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలను ట్రంప్ కొట్టేశారు. ఆర్థిక మాంద్యం కంటే అణ్వాయుధాల ముప్పు చాలా ప్రమాదకరమని చెెప్పారు. అణ్వాయులు ప్రపంచాన్ని ఇంకా నాశనం చేస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా చేయడమే అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఈ ఒప్పందం పునాది వేసిందంటూ పేర్కొన్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలపై కఠిన తనిఖీలకు అంగీకరించిందని కూడా వాన్స్ చెప్పడం విశేషం. అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండిస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో సహకారం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని తెలిపారు. ఇరాన్ పార్లమెంట్, జాతీయ భద్రతా మండలి తీసుకునే నిర్ణయాల మేరకే భవిష్యత్ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పంద చర్చలపై తలోక మాట చెబుతున్నారు. అమెరికా మాత్రం చర్చలు సఫలమయ్యాయని చెబుతుంటే.. ఇరాన్ మాత్రం అమెరికాను ఎప్పటికీ నమ్మబోమని తెగేసి చెబుతోంది. శాంతి ఒప్పంద చర్చలను పాటించకపోతే తానేంటో చూపిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.