గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. FD వడ్డీ రేట్లు పెంపు.. జూన్ 20 నుంచే అమలులోకి..

Wait 5 sec.

FD Rate Hike: దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ (Bandhan Bank) తమ కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పింది. తమ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏకంగా 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లను జూన్ 20, 2026 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ పెంపుదల 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల గరిష్ఠంగా 7.95 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు ఈ గరిష్ఠ వడ్డీ ప్రయోజనం అందిస్తోంది. ఇదే కాల పరిమితి గల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 7.45 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.దీంతో పాటు 5 ఏళ్ల లోపు కాల పరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా బంధన్ బ్యాంక్ అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు, ఇతరులకు 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా అధికారిక ఎంబంధన్ (mBandhan) మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్లోనే సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా నిమిషాల్లోనే పనులు పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది.బంధన్ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 30 రోజుల టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 3.70 శాతం వడ్డీ ఇస్తోంది. 31 రోజుల నుంచి 2 నెలలలోపు అయితే 4.20 శాతం, 2 నెలల నుంచి 1 సంవత్సరంలోపు అయితే 4.95 శాతం వడ్డీ ఇస్తోంది. 1 సంవత్సరం నుంచి 2 ఏళ్లలోపు ఉండే డిపాజిట్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 ఏళ్లలోపు అయితే 7.95 శాతం వడ్డీ అందిస్తోంది. 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్లలోపు అయితే 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.60 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఇక పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు అయితే 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. పైన చెప్పినవన్నీ 60 ఏళ్ల వయసు దాటిన కస్టమర్లకు వర్తిస్తాయి.