Income Tax Deadlines: జూన్ నెల ముగించుకుని జులై 2026 నెలలోకి అడుగుపెడుతున్నాం. సాధారణ ప్రజలకు జులై సాధారణ నెలగానే కనిపించినా ట్యాక్స్ పేయర్లకు మాత్రం చాలా ముఖ్యమైన నెల. ఈ జులై నెలలోనే పలు ముఖ్యమైన ట్యాక్స్ పనులు పూర్తి చేయాల్సిన గడువు తేదీలు ఉంటాయి. వీటిల్లో ప్రధానంగా ఆదాయపు పన్ను రిటర్నులుఈ గడువు తేదీలను మిస్ అయినట్లయితే భారీగా పెనాల్టీలు, వడ్డీల వంటివి చెల్లించాల్సి వస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నవారైనా, బిజినెస్ ఓనర్ అయినా లేదా కంపెనీ యాజమాన్యం అయినా ఈ ట్యాక్స్ డెడ్‌లైన్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. గడువు తేదీలను అనుసరిస్తూ ట్యాక్స్ పనులు పూర్తి చేయడం మంచిది. లేదంటే చివరి నిమిషంలో రద్దీని తట్టుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జూన్ 30 తర్వాత ట్యాక్స్ పేయర్లు, బిజినెస్‌ చేసే వారు జులై నెలలో వచ్చే గడువు తేదీలకు తగినట్లుగా సిద్ధమవ్వాలి. జులై 2026లోని గడువు తేదీల పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. జులై 7వ తేదీ: గత ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి సంబంధించిన ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) డిపాజిట్ చేసేందుకు జులై 7 గడువు తేదీ. ఒక వేల ఈ గడువు దాటితే పెనాల్టీలతో పాటు వడ్డీ సైతం కట్టాల్సి వస్తుంది. జులై 15వ తేదీ: ఈ తేదీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, అధీకృత డీలర్లు, ఐఎఫ్‌ఎస్‌సి యూనిట్లు, ప్రవాస పెట్టుబడిదారులతో వ్యవహరించే మధ్యవర్తులు నివేదించాల్సిన పన్ను బాధ్యతలకు ఈ గడువు ఉంటుంది.జులై 30వ తేదీ: జూన్ నెలలో ట్యాక్స్ డిడక్ట్ చేసిన డిడక్టర్స్ తమ చాలన్ కమ్ స్టేట్మెంట్ ఫైల్ చేసేందుకు గడువుజులై 31వ తేదీ: ట్యాక్స్ పేయర్లకు జులై 31 అనేది అత్యంత కీలకమైన గడువు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు తేదీ దాటితే బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందుకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. జులై 31వ తేదీ: అలాగే జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సైతం ఇదే గడువు. శాలరీ పేమెంట్ల టీడీఎస్ స్టేట్మెంట్, నాన్ రెసిడెండ్ల పేమెంట్స్ మోడ్ వంటివి ఇందులో ఉంటాయి. జులై 31వ తేదీ: అద్దె చెల్లింపులపై సెక్షన్ 80జీజీ కింద డిడక్షన్లు క్లెయిమ్ చేసేందుకు ఫామ్ 10బీఏ సబ్మిట్ చేసేందుకు, శాలరీ ఏరియర్స్ లేదా అడ్వాన్సులపై రిలీఫ్ పొందేందుకు ఫామ్ 10ఈ సమర్పించేందుకు, విదేశీ ఆదాయం, రాయల్టీ సంబంధిత డిడక్షన్లు క్లెయిమ్ చేసేందుకు ఫామ్ 10హెచ్, 10సీసీఈ, 10సీసీడీ ఫైల్ చేసేందుకు సైతం ఇదే గడువు తేది ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయితే ఏమవుతుంది? అలాగే పలు పెట్టుబడులు, బిజినెస్ నష్టాలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసేందుకు ఉన్న అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అయితే, డిసెంబర్ 31వ తేదీ వరకు బిలెటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఇందుకోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.