అఫ్గనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. జమ్మూ కశ్మీర్, ఢిల్లీలోనూ ప్రకంపనలు

Wait 5 sec.

అఫ్గనిస్థాన్‌లో శనివారం సాయంత్రం తీవ్ర సంభవించింది. హిందూ కుష్‌ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య అఫ్గన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కి.మీ. దూరంలో ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఉపరితలానికి 215 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉండటంతో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా జియోలాజికల్ సర్వే అఫ్గన్ ఈశాన్య ప్రాంతం జుర్మ్‌కి 43 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్టు వెల్లడించింది. ఈ భూకంప ప్రభావంతో పొరుగున్న పాకిస్థాన్, చైనాలతో పాటు భారత్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.కాబూల్, తూర్పు ప్రావిన్సులైన ఖోస్ట్, నంగర్హర్‌లో భూకంపం సంభవించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌, స్వాత్, హంగు, ఉత్తర వజీరీస్థాన్, చిత్రల్, రావల్పిండిలో కూడా ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈ ప్రకంపనలు భయాందోళనలను సృష్టించాయి. దీంతో జనం తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫిబ్రవరిలోనూ అఫ్గనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. దీని ప్రభావంతో ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో వచ్చాయి. రెండు రోజుల కిందట వెనుజులాపై నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు విరుచుకుపడి.. 920 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. రాజధాని కారకస్ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం చీఫ్ టామ్ ఫ్లెట్చర్ ప్రకారం.. 50 వేల మందికిపైగా గల్లంతయ్యారు.