కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన పవర్ సెక్టార్ ఫైనాన్స్ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), ఆర్ఈసీ లిమిటెడ్ (REC) విలీనానికి రెండు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ విలీనంతో ఇప్పుడు ఏకంగా రూ. 11 లక్షల కోట్ల భారీ లోన్ బుక్ కలిగిన దేశంలోనే అతిపెద్ద పవర్ ఫైనాన్సింగ్ సంస్థ ఏర్పడుతుంది. ఇక్కడ మీ దగ్గర ఆర్ఈసీ షేర్లు ఉంటే అవి రద్దయి వాటి స్థానంలో పీఎఫ్‌సీ కంపెనీలో షేర్లు కేటాయిస్తారు. పీఎఫ్‌సీ కంపెనీలో ఇప్పుడు ఆర్ఈసీ విలీనం కాబోతుంది. ఆర్ఈసీలో ప్రస్తుతం పీఎఫ్‌సీ వాటా 52.63 శాతంగా ఉండగా, పీఎఫ్‌సీలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 55.99 శాతం వాటా ఉంది. అదే ప్రభుత్వానికి ఆర్ఈసీలో నేరుగా వాటా లేదని తెలుసుకోవాలి.=ఇక్కడ ప్రభుత్వ సంస్థల విలీనానికి () అనుగుణంగా షేర్ల మార్పిడి జరగనుంది. ఆర్ఈసీకి సంబంధించి రూ. 10 ముఖ విలువతో 100 షేర్లు ఉంటే.. వారికి అదే రూ. 10 ఫేస్ వాల్యూతో 88 పీఎఫ్‌సీ షేర్లు లభిస్తాయి. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో విలీనం తర్వాత ఈ మేరకు షేర్ల మార్పిడి ఉంటుంది. ఇక్కడ ఆర్ఈసీ షేర్లు పీఎఫ్‌సీ షేర్లుగా మారతాయి కాబట్టి ఆర్ఈసీలో ఉండే 100 షేర్లు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. అది ఇంకా స్టాక్ మార్కెట్లో కనిపించదు.హైలైట్స్ (PFC Rec Share Swap Ratio)ఇక్కడ కొన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.పీఎఫ్‌సీలో ఆర్ఈసీ విలీనం అవుతుంది కాబట్టి పీఎఫ్‌సీ షేర్లు ఉన్న వారు ఏమీ చేయాల్సిన పని లేదు. వారి షేర్లు అలానే ఉంటాయి. అదే ఆర్ఈసీ షేర్లు ఉన్న వారికి మాత్రం పైన పేర్కొన్న నిష్పత్తిలో పీఎఫ్‌సీ షేర్లు డీమ్యాట్ ఖాతాలో యాడ్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ ఖరారు కాలేదు. ఆలోపు మీకు ఆర్ఈసీ షేర్లు ఉంటే.. ఇవి పీఎఫ్‌సీ షేర్లుగా నిర్ణయించిన నిష్పత్తిలో మార్పిడి జరుగుతుంది. ఈ విలీనానికి స్టాక్ ఎక్స్చేంజీలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), షేర్ హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంటుంది.ఇదిలా ఉండగా ఇవాళ పీఎఫ్‌సీ షేరు ఇంట్రాడేలో 2 శాతానికిపైగా పడిపోయి రూ. 422.20 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం 1.70 శాతం నష్టంతో రూ. 425.05 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 1.40 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు ఆర్ఈసీ షేర్ ధర ఫ్లాట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 364.65 గా ఉంది. మార్కెట్ వాల్యుయేషన్ రూ. 96.05 వేల కోట్లుగా ఉంది.