ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ దంపతుల సందడి..

Wait 5 sec.

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహం వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌తో ఆమె మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. గోవాలో ఓ రిసార్ట్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి - సురేఖ, - అమల, వెంకటేష్ - నీరజ దంపతులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురూ తమ సతీమణులతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. 80స్, 90స్ స్టార్స్ అంతా ఒకే వేడుకలో కనిపించడంతో సందడిగా మారింది. వారితో పాటుగా హీరోయిన్ త్రిష కూడా ఈ పెళ్లిలో కనిపించారు.చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో ఖుష్బూకి మంచి సాన్నిహిత్యం ఉంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ముగ్గురూ ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ బంధం ఉంది. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినా, రియల్ లైఫ్ లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఖుష్బూ కుమార్తె వెడ్డింగ్ లో ఈ ముగ్గురు సీనియర్లు ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.'కలియుగ పాండవులు' చిత్రంతో వెంకీ, ఖుష్బూ ఇద్దరూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. 'కెప్టెన్ నాగార్జున' అనే చిత్రంలో నాగ్, ఖుష్బూ కలిసి జంటగా నటించారు. 'స్టాలిన్' మూవీలో చిరంజీవి సోదరి పాత్ర పోషించారు ఖుష్బూ.