Upcoming IPO: ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ కంపెనీ న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ () జులై 1వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. స్టాక్ మార్కెట్ ద్వారా పబ్లిక్ ఇష్యూల్లో బిడ్లు దాఖలు చేసి ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో చాలా తక్కువ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో ప్రారంభమవుతోంది. సబ్‌స్క్రిప్షన్ జులై 3, 2026వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ.440 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు విలువ (Price band) రూ.161 నుంచి రూ.170గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.440 కోట్లు సమీకరించనుంది. రూ.2080 కోట్ల మార్కెట్ విలువతో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఒక రోజు ముందుగానే అంటే జూన్ 30వ తేదీనే యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ విండో తెరుచుకుంటుంది. అలాగే వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.58.5 కోట్లు విలువైన షేర్లను కంపెనీ వాటాదారులు విక్రయానికి తీసుకొస్తున్నారు. రెండూ కలిపి మొత్తంగా రూ.439.5 కోట్లు విలువైన షేర్లను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ఒక బిడ్ కు కనీసం 88 షేర్లను (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే షేరు గరిష్ఠ ధరతో రూ.14,960 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇష్యూలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో జులై 8వ తేదీన లిస్టింగ్ కానున్నాయి. సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్, ఐడీబీఐ క్యాపిటల్, పాంటో మ్యాథ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కొత్త తయారీ సెంటర్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని కంపెనీ కార్యకలాపాలకు ఉపయోగించనుంది. న్యాక్ ప్యాకేజింగ్ కంపెనీ అహ్మదాబాద్ కేంద్రంగా ప్రింటెడ్, లామినేటెడ్ వోవెన్ పాలిప్రోఫైలిన్ బ్యాంకులు, పీఎల్ డబ్ల్యూపీపీ పించ్ బాటమ్ బ్యాగులను తయారు చేస్తోంది.