తెలంగాణపై దృష్టి సారిస్తుందని.. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించిన ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే జనసేన పార్టీలో నేతల చేరికల కోసం ప్రత్యేకంగా ఒక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన భావజాలం నచ్చి.. పార్టీలో చేరాలి అనుకునేవారిని ఆహ్వానించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు, సమాజంలోని పలువురు విద్యావంతులు, సామాజికవేత్తలు, సెలబ్రిటీలను ఆహ్వానించేందుకు.. పార్టీలోకి చేరే నేతలను సమన్వయం చేసేందుకు జనసేన పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక తెలంగాణ జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. తెలంగాణ రాష్ట్ర మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, హీరో అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మాజీ డీసీపీ మేడూరి సరస్వతి సభ్యులుగా ఉండనున్నారు.ఈ జాయినింగ్స్ కమిటీ మొదట రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వస్తున్న చేరికలకు సంబంధించిన విజ్ఞప్తులను పరిశీలించనుంది. అనంతరం ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పరిశీలించి.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు భారీ ఎత్తున నేతల చేరికల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపైనా దృష్టి పెట్టింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకోవడంలో భాగంగా ఈ కమిటీకి శ్రీకారం చుట్టారు. ఈ కమిటీ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగం పెంచడంతోపాటు.. ఇతర పార్టీల నుంచి వచ్చే వలస నేతలను ఆహ్వానించనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు ఇతర తటస్థులను పార్టీలోకి చేర్పించే కీలక బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.అదే సమయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా విభాగం కో ఆర్డినేటర్‌గా దుంపటి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. జనసేన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించడం లక్ష్యంగా జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.