Fixed Deposit Tax: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి ఇచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు. వీరందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. లక్షల రూపాయలను నిర్ణీత కాల వ్యవధికి డిపాజిట్ చేస్తుంటారు. దానిపై మంచి వడ్డీ రేటు పొందుతారు. అయితే, ఇక్కడే ఒక విషయాన్ని మర్చిపోతుంటారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం అనేది ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ (TDS) కట్ చేస్తారు. మీరు పన్ను పరిధిలో లేకపోయినప్పటికీ ఈ చేస్తుంటారు. మరి ఈ టీడీఎస్ డిడక్షన్లను తప్పించుకునేందుకు ఏం చేయాలి? ఏ ఫామ్ ఇస్తే టీడీఎస్ ట్యాక్స్ కట్ చేయకుండా ఉంటుంది?బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ కట్ కాకుండా ఉండేందుకు ఖాతాదారులు , ఇవ్వాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసు ఉన్నవారు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఫామ్ 15జీ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. తమ ఆదాయం పన్ను పరిధిలోకి రావడం లేదని, ఆర్థిక సంవత్సరంలో తాను ట్యాక్స్ కట్టడం లేదంటూ అధికారికంగా చెప్పేందుకు ఈ ఫామ్ ఇవ్వాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం జీరోగా ఉన్నప్పుడు ఈ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పన్ను పరిధిలోకి వచ్చినా తమ మొత్తం డిడక్షన్లు, మినహాయింపులు పోయిన తర్వాత ట్యాక్స్ లిమిట్ లోపు వస్తే సైతం ఇవ్వవచ్చు. అయితే, దీనిని 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఇవ్వడం ద్వారా ఎలాంటి టీడీఎస్ డిడక్షన్ లేకుండా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. పదవీ విరమణ తర్వాతా చాలా వరకు సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లపైనే ఆధారపడుతుంటారు. తమ మొత్తం ట్యాక్స్ బాధ్యత అనేది జీరోగా ఉన్నప్పుడు ఎలాంటి టీడీఎస్ కట్ కాకుండా చూసేందుకు ఈ ఫామ్ 15హెచ్ అనేది సాయపడుతుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఫామ్ ఉపయోగించవచ్చు. ఈ ఫామ్ ఎక్కడ తీసుకోవాలి?ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ అనేది బ్యాంక్ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ లేదా ఈపీఎఫ్ఓ ప్లాట్ ఫామ్ లేదా ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫారాలను వివిధ డిడక్టర్లకు సమర్పించవచ్చు. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లకు బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇవ్వవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి, ఇన్సూరెన్స్ కంపెనీలకు, డివిడెండ్ ఇచ్చే కంపెనీలకు, మ్యూచువల్ ఫండ్ హౌస్, ఇతర ఆర్థిక సంస్థలతో పాటు అద్దెకు ఉండే వారికి ఇవ్వాల్సి ఉంటుంది.