ఏడాదికే పెట్టుబడి డబుల్.. ఇప్పుడు 10 షేర్లకు 100 షేర్లు ఇస్తోన్న కంపెనీ.. చివరి తేదీ ఇదే!

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని స్టీల్ అండ్ ఐరన్ సెక్టార్ కంపెనీ లిమిటెడ్ () బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే తమ వాటాదారులకి శుభవార్త చెప్పారు. తమ కంపెనీలో 10:1 రేషియోలో చేపట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలుపడం జరిగింది. కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది.మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో తమ షేర్ హోల్డర్లకు ఏకంగా 127 శాతం లాభాన్ని అందించింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటిగా నిలిచింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 371 వద్ద ఉన్న షేర్ ధర రూ. 37 ల స్థాయికి తగ్గనుంది. అలాగే షేర్ల సంఖ్య పది రెట్లు పెరగనుంది. 100 షేర్లు కొన్నవారికి ఏకంగా 1000 షేర్లు లభిస్తాయి. వైడ్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని ఆమోదం తెలిపారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 ఈక్విటీ షేర్స్ గా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ సంబంధించిన రికార్డు డేట్ జులై 10, 2026గా బోర్డు డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్టాక్ స్ప్లిట్ ప్రకారం 10 షేర్లు కొనుగోలు చేసినట్లయితే 100 షేర్లొస్తాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత నెల రోజుల్లో 1 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 39 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 127 శాతం లాభాన్ని అందించింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి ఇందులో షేర్లు కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 2.27 లక్షలు అవుతుంది. అంటే ఏడాదిలోనే పెట్టుబడి రెండింతలకు పైగా పెరిగింది. గత ఐదు సంవత్సరాలలో 236 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1100 కోట్లుగా ఉంది. అయితే ఈ కథనం సమాచారం కోసమే. మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. స్టాక్ స్ప్లిట్ ద్వారా షేర్ల సంఖ్య పెరుగుతుంది, ధర తగ్గుంది. అయితే పెట్టుబడిలో ఎలాంటి మార్పు ఉండదు.