ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్- 10 రోజుల్లోనే సీన్ రివర్స్- ఏకంగా రూ. 47 లక్షల కోట్లు ఆవిరి!

Wait 5 sec.

: కొద్ది రోజుల కిందట స్పేస్ ఎక్స్ ఐపీఓ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఎక్స్ గురించి తెగ చర్చించుకున్నారు. రికార్డు స్థాయిలో 85 బిలియన్ డాలర్లకుపైగా నిధుల్ని సమీకరించి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఇష్యూ ప్రైస్ 135 డాలర్లుగా ఉంగాగా 12 శాతం వరకు ప్రీమియంతో 150 డాలర్ల మార్కుపైన జూన్ 12న లిస్టయింది. ఇంకా తొలి రోజే 160 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పేస్ ఎక్స్‌లో సంస్థ సీఈఓ, బాస్ దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్‌కు అధిక వాటా ఉండటంతో లిస్టింగ్ కాగా ఆ వాటా అన్‌లాక్ అయింది. దీంతో ఆయన సంపద విశేషంగా పెరిగి ఏకంగా ట్రిలియన్ డాలర్ మార్కును అధిగమించింది. ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్ల డాలర్లు అన్నమాట. దీంతో . అయితే ఇప్పుడు మస్క్ ఆ హోదాను కోల్పోవడం గమనార్హం.ఒక ట్రిలియన్ డాలర్ అంటేనే భారత కరెన్సీలో సుమారు రూ. 95 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అయితే లిస్టింగ్‌తో ఆయన సంపద ఇంకా ఎక్కువగా రూ. 100 లక్షల కోట్ల మార్కు కూడా దాటింది. కొద్ది రోజులు స్పేస్ ఎక్స్ షేరు కూడా భారీగా పెరిగి ఇష్యూ ప్రైస్ దాదాపు 70 శాతం వరకు ఎగబాకి 225.64 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఇక్కడ చూస్తే మస్క్ సంపద సుమారు 1.45 ట్రిలియన్ డాలర్ల వరకు విలువ పెరిగింది. ఇది భారత కరెన్సీలో రూ. 137 లక్షల కోట్ల వరకు ఉంటుంది. సడెన్‌గా మళ్లీ స్పేస్ ఎక్స్ షేరు ఎక్కడి నుంచి పెరిగిందో అక్కడికే పడిపోయింది. కంపెనీ ఏఐ లక్ష్యాల కోసం.. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయిస్తానని మస్క్ ప్రకటించడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో వరుస సెషన్లలో గరిష్ఠాల నుంచి స్పేస్ ఎక్స్ షేరు పతనంతో మళ్లీ షేరు ధర 150 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే లిస్టింగ్ ధర దగ్గరికి వచ్చి చేరింది. నిన్నటి వరకు స్పేస్ ఎక్స్ షేరు ధర తగ్గగా జూన్ 23న టెస్లా షేరు భారీగా 6 శాతం వరకు పతమైంది. మస్క్‌కే చెందిన ఈ కంపెనీలో కూడా ఆయనకు అధిక వాటా ఉంది. ఈ క్రమంలోనే మస్క్ సంపద ఒక్కరోజు వ్యవధిలో 118 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ. 11 లక్షల కోట్లకుపైగా ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయన సంపద 957 బిలియన్ డాలర్లకు (రూ. 90 లక్షల కోట్లు) పడిపోగా 10 రోజుల వ్యవధిలో ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు. ఆయన గరిష్ఠ సంపద నుంచి చూస్తే 10 రోజుల్లో రూ. 47 లక్షల కోట్ల వరకు సంపద ఆవిరికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ కూడా రికార్డు స్థాయిలో పతనం అవుతూ వస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మస్కే ఉన్నారు. మళ్లీ స్పేస్ ఎక్స్, టెస్లా షేర్లు పుంజుకుంటే కొద్ది రోజుల్లోనే మళ్లీ ట్రిలియనీర్ హోదాను అందుకోవచ్చని తెలుస్తోంది.