Multibaggers: గడిచిన మూడు నెలల కాలంలో భారతీయ ఈక్విటీలు తీవ్ర అనిశ్చితికి లోనయ్యాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో మళ్లీ వేగంగా పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. మన మార్కెట్లలోనూ అదే జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 4 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో బీఎస్ఈ 500 ఇండెక్స్ 10 శాతం వరకు ర్యాలీ చేసింది. లార్జ్ అండ్ మీడియా క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడమే ఇందుకు కారణం. సెన్సెక్స్ 30లోని స్టాక్స్ మధ్యస్థంగా కదలాడినీ ఈ కేటగిరీలోని స్టాక్స్ మంచి పనితీరును కనబరిచాయి. గత 3 నెలల కాలంలో దాదాపు 32 స్టాక్స్ 50 శాతానికి పైగా లాభపడ్డాయి. అందులో 13 స్టాక్స్ 70 శాతం నుంచి 200 శాతం వరకు లాభాలు అందించాయి. మళ్లీ అందులో 3 మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. మరి ఆ స్టాక్స్ గురించి తెలుసుకుందాం.హెచ్‌ఎఫ్‌సీఎల్ (HFCL): రూ.70 స్థాయి నుంచి రూ.205 స్థాయికి పెరిగింది. ప్రస్తుతం 52 వారాల గరిష్ఠ ధర రూ.220లకు సమీపంలో ట్రేడవుతోంది. ఇందులో 3 నెలల కింద లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్నట్లయితే ఇప్పుడు ఆ విలువ దాదాపు రూ.3 లక్షలు అవుతుంది. సెమ్‌ఇండియా ప్రాజెక్ట్స్: ఈ స్టాక్ గత 3 నెలల్లో 126 శాతం రాణించింది. రూ.538 నుంచి రూ.1218కి పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1290గా ఉంది. ఇందులో లక్ష పెడితే 3 నెలల్లోనే రూ.2.60 లక్షలకు పైగా వస్తాయి. ఆదిత్య ఇన్ఫోటెక్: ఈ స్టాక్ గడిచిన 3 నెలల్లో 116 శాతం మేర పెరిగింది. రూ.1673 స్థాయి నుంచి రూ.3,617కు పెరిగింది. లక్ష పెట్టిన వారికి రూ.2.16 లక్షలు అందించింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్: ఈ స్టాక్ మూడు నెలల కాలంలో 93 శాతం మేర పెరిగింది. రూ.1329 నుంచి రూ.2561 స్థాయికి చేరింది. ఇందులో లక్ష రూపాయలు పెడితే 3 నెలల్లో దాదాపు రూ.2 లక్షలు అందించింది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ: రూ.23 స్థాయి నుంచి రూ.43 స్థాయికి చేరింది. లక్ష పెడితే రూ.1.85 లక్షలకు పైగా అందించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ: అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్ గత మూడు నెలల్లో 82 శాతం పెరిగింది. రూ.839 నుంచి రూ.1525కు పెరిగింది. దీంతో లక్ష పెట్టుబడి 3 నెలల్లోనే రూ.1.82 లక్షలకు చేరింది. ఆర్ఆర్ కేబుల్: ఈ స్టాక్ గత మూడు నెలల్లో 81 శాతం ర్యాలీ చేసింది. లక్ష పెట్టిన వారికి రూ.1.81 లక్షలు అందించింది. సైర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ: ఈ కంపెనీ స్టాక్ మూడు నెలల్లో 80 శాతం లాభపడింది. లక్ష పెట్టిన వారికి రూ.1.80 లక్షలు ఇచ్చింది. ఏజిస్ లాజిస్టిక్స్: ఈ స్టాక్ గత మూడు నెలల కాలంలో 77 శాతం ర్యాలీ చేసింది. రూ.599 నుంచి రూ.1063కు చేరింది. లక్షకు రూ.1.77 లక్షలు అందించింది. వెల్స్పన్ కార్ప్: ఈ స్టాక్ 75 శాతం పెరిగింది. 3 నెలల్లోనే లక్షకు రూ. 1.75 లక్షలు అందించింది. దీపక్ ఫెర్టిలైజర్స్ అంట్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్: ఈ కంపెనీ స్టాక్ గత 3 నెలల కాలంలో 74 శాతం ర్యాలీ చేసి లక్షరూపాయల పెట్టుబడిని రూ.1.74 లక్షలుగా చేసింది. వోఖార్డ్: ఈ కంపెనీ స్టాక్ 72 శాతం మేర పెరిగింది. 3 నెల్లలోనే లక్షకు రూ.1.72 లక్షలు అందించింది. అపర్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ స్టాక్ గత మూడు నెలల్లో 69 శాతం మేర ర్యాలీ చేసింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.1.69 లక్షలు చేసింది.గమనిక: ఈ కథనం కేవలం సమాచారం ఇచ్చేందుకే. ఈక్విటీ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే స్టాక్ గురించి ముందే పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎలాంటి సమాచారం లేకుండా, నిపుణుల సలహా తీసుకోకుండా పెట్టుబడి పెడితే మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.