ఏపీ డిప్యూటీ సీఎం తీసుకున్నారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించిన అనంతరం చేపట్టారు. ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేపడుతుంటారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్షను విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రోజున . దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. అలాగే విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. దీక్షా సమయంలో ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను పవన్ కళ్యాణ్ అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధన చేస్తూ.. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.మరోవైపు పపన్ కళ్యాణ్ చాతుర్మాస గతంలోని పాత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ పంచుకుంది. తల్లి అంజనాదేవి, సోదరులు చిరంజీవి, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటో ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే దీక్ష సమయంలో గద్దర్‌తో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను పంచుకుంది. చేస్తున్న ఫోటోలను జనసేన షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు డిప్యూటీ సీఎంకు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సందర్శన సమయంలో రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.