పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను స్విట్జర్లాండ్‌లో హత్య చేసేందుకు మొసాద్ ప్లాన్..!

Wait 5 sec.

ఇరాన్‌తో శాంతి చర్చల కోసం జెనీవాలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను, ఆయనతో పాటు ఉన్న ప్రతినిధి బృందాన్ని హత్య చేయడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ కుట్ర పన్నిందని బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ నిపుణుడు పెపె ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణను ఒక పాక్ జర్నలిస్ట్ మాత్రం ఖండించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాథమిక ఒప్పందానికి 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (MoU) అని పేరు పెట్టారు. శాశ్వత ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్ మధ్య తదుపరి చర్చలు జెనీవాలో జరిగాయి. ఇందులో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాఘ్చీ బృందం హాజరయ్యింది.రాజకీయ వ్యాఖ్యాత మారియో నౌఫల్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో.. బ్రెజిల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు పెపె ఎస్కోబార్.. అసిమ్ మునీర్‌ను హత్య చేయడానికి మొస్సాద్ కుట్ర పన్నిందన్న సంచలన వాదన చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చల సందర్భంగా మునీర్‌ను, బహుశా పాకిస్తానీ ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులను కూడా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఆదేశాలతో చంపడానికి మొస్సాద్ ప్లాన్ చేసినట్టు పాక్ గూఢచార సంస్థ ముందే పసిగట్టిందని ఎస్కోబార్ పేర్కొన్నారు.అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా విమర్శించింది. తమను సంప్రదించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని హెజ్బొల్లాపై సైనిక చర్య ఆపే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. పాడ్‌కాస్ట్‌లో దౌత్యపరమైన చర్చల వెనుక పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణల నివేదికల గురించి అడిగిన ప్రశ్నకు ఎస్కోబార్‌ బదులిస్తూ.. ‘బెంజిమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు.. స్విట్జర్లాండ్ వెళ్తున్న అసీమ్ మునీర్, ఇతర ప్రతినిధులపై హత్యాయత్నానికి మొసాద్ సిద్ధమవుతోందనే అత్యంత విశ్వసనీయమైన సమాచారం పాకిస్థాన్ సైన్యానికి అందింది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్‌కు పాక్ బెదిరింపులుమొసాద్ కుట్ర గురించి తెలుసుకున్న తర్వాత దౌత్య మార్గాల్లో పాకిస్థాన్ తీవ్రంగా స్పందించినట్టు ఎస్కోబార్ తెలిపారు. ‘‘తమ సాధారణ మధ్యవర్తులు అంటే ఒమన్ ద్వారానే అయి ఉంటుందని నేను పందెం కాయగలను.. నేరుగా ఇజ్రాయెల్‌కు ఒక సందేశం పంపారు. 'మీరు మా ప్రతినిధి బృందాన్ని తాకితే, మేము మిమ్మల్ని ప్రపంచ పటం నుంచి మాయం చేస్తామని హెచ్చరించింది..’’ అని ఆయన అన్నారు. అంటే, అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ పరోక్షంగా హెచ్చరించిందని ఆయన అన్నారు.అయితే, ఎస్కోబార్ వాదనను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. పాకిస్థాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కూడా దీనిని నిర్ధారించలేదు. ఆయన వాదనకు మద్దతు ఇచ్చే ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం కోసం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పాకిస్థాన్ ప్రతినిధి బృందం వెళ్లిన కొద్ది రోజులకే మునీర్ హత్య ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మునీర్ ఆ ఉన్నత స్థాయి పాకిస్థానీ ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నారు అయితే, పాకిస్థానీ జర్నలిస్టులు కూడా ఎస్కోబార్ వాదనను కల్పితమని తిరస్కరించారు.సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ తలత్ హుస్సేన్ మునీర్‌పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణను బహిరంగంగా ఖండించారు. ‘‘ఇది పూర్తిగా నిరాధారమైనది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. అలాంటిది ఎప్పుడూ జరగలేదు’’ అని హుస్సేన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ సీనియర్ భద్రతా అధికారి ఈ ఆరోపణను వికృత ప్రచారంగా అభివర్ణించారని కూడా హుస్సేన్ తెలిపారు.