‘రో-కోపై ఏదో ఒకటి తేల్చేయండి’: అశ్విన్‌

Wait 5 sec.

టీమిండియా స్టార్ ప్లేయర్లు , .. భవితవ్యంపై భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ అడుగులు వేస్తున్నారు. కానీ వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా.. లేదా అనే అంశంపై బీసీసీఐ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. కొందరు.. రోకో ప్రపంచకప్ ఆడరని.. మరికొందరు ఆడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడాడు. వీరిపై సెలక్టర్లు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.“ఇటీవల కాలంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి వస్తున్న వార్తలు బాలేవు. కొందరు పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఎక్కడ నుంచి ఇలాంటి నెగెటివ్ ప్రచారం వస్తోందో తెలియడం లేదు. కొందరు మాత్రం ఈ ఇద్దరు ప్రపంచ కప్‌లో ఆడకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో మాత్రం అర్థం కావడంలేదు. కొందరేమో వారు ఆడకపోవచ్చని అనుమానాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం రో-కో ఉంటేనే బాగుంటుందంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వన్డే ప్రపంచకప్‌ 2027లో రోహిత్, కోహ్లీ తప్పకుండా ఆడాలి” అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో అశ్విన్.. భారత సెలక్టర్లకు కీలక సూచన చేశాడు. “దక్షిణాప్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఉండాలని మీరు కోరుకుంటే.. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. అలా చేయడం వల్ల టోర్నీ నాటికి వారు పూర్తి సన్నద్ధతతో, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. మున్ముందు ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారుతుంది. గందరగోళానికి దారి తీస్తుంది” అని రవిచంద్రన్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.రోహిత్, కోహ్లీ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. రోహిత్ ఇటీవల అఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌లో రాణించాడు. గాయం కారణంగా కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే నెలలో