: ఆధార్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా () తాజాగా కీలక ప్రకటన చేసింది. () ద్వారా ఇ- మెయిల్ అడ్రస్ అప్డేట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ మాత్రమేనని తెలిపింది. ప్రస్తుతం చేస్తుండగా దానిని మాఫీ చేస్తున్నామని పేర్కొంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.యూఐడీఏఐ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 'ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రస్తుతం ఇ- మెయిల్ అడ్రస్ అప్డేట్ కోసం ఛార్జ్ చేస్తున్న రూ. 75 మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆరు నెలల వరకు ఉచితంగా ఈ అప్డేట్ సేవలు అందించాలని నిర్ణయించాం. ఇది 2026, జులై 1 నుంచే అమలులోకి వస్తాయి. 2026, డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది' అని యూఐడీఏఐ పేర్కొంది. ప్రస్తుతం ఆధార్ యూజర్లు తమ ఇ-మెయిల్ అప్డేట్ కోసం రూ. 75 చెల్లిస్తున్నారు. అయితే, వచ్చే ఆరు నెలల వరకు ఈ ఫీజు మాఫీ చేస్తున్నారు.మీకు అన్ని రకాల నోటిఫికేషన్లు సరైన సమయానికి పొందవచ్చు. దీంతో మీ ఆధార్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి అప్డేట్ ఉంటుంది. అలాగే యూఐడీఏఐ ఇటీవలే ఆధార్ మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసింది. ఆధార్ సంబంధిత సేవలను సురక్షితంగా, సౌకర్యవంతంగా అందించేందుకు ఈ కొత్త యాప్ లాంచ్ చేసింది. ప్రస్తుతం మాఫీ చేసిన రూ. 75 అనేది జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుందని, డిసెంబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఉచిత సేవలు కొనసాగించాలా వద్దా అనేది సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.