జియో ఐపీఓ వస్తోంది.. దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు.. చాలా రోజులకు అంబానీ స్టాక్ ఇలా..

Wait 5 sec.

: రిలయన్స్ గ్రూప్ నుంచి చాలా కాలం తర్వాత ఎట్టకేలకు ఒక ఐపీఓ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. అదే టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్. గత శుక్రవారమే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) ముందు జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోసం ప్రాథమిక ముసాయిదా పత్రాల్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) దాఖలు చేసింది. అంతకుముందు జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 27 కోట్ల మేర కొత్త ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నారు. దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 38 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ ఐపీఓ రాబోతున్న నేపథ్యంలో షేర్లు సోమవారం సెషన్‌లో పుంజుకున్నాయి. కిందటి సెషన్‌లో రూ. 1309.50 వద్ద ముగియగా ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాల్లో ప్రారంభమై మార్కెట్ పుంజుకుంటున్న కొద్దీ ఈ స్టాక్ కూడా పెరుగుతూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో దాదాపు 3 శాతం వరకు పెరిగి రూ. 1344.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇది రూ. 1332 స్థాయిలో ఉంది. రిలయన్స్ స్టాక్ చాలా రోజుల తర్వాత ఇలా 2-3 శాతం వరకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 18.02 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1611.80 కాగా.. కనిష్ఠ ధర రూ. 1253.20 వద్ద ఉంది. గత 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ 15 శాతం వరకు కుదేలైంది. ఏడాదిలో 8 శాతం నష్టపోవడం విశేషం. ఇలా నష్టాల్ని ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఐపీఓ రాబోతుండగా దూసుకెళ్తుండటం విశేషం. ఏజీఎంలో జియో ఐపీఓపై ప్రకటన చేసిన ముకేశ్ అంబానీ ఇది తనతో సహా రిలయన్స్ ఫ్యామిలీకి, కోట్లాది మంది షేర్ హోల్డర్లకు భావోద్వేగభరిత క్షణమని అన్నారు. ఈ ఏడాది రిలయన్స్‌కు కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది తమ వాటాదారులకు మంచి విలువను అందించడం సహా కొత్త పెట్టుబడిదారులకు కూడా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ప్రమోటర్ గ్రూప్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం వాటా ఉంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ చూస్తే దాదాపు 400, నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పెరిగింది.